మెగాస్టార్ అభిమానులకు `ఆచార్య` నవమి ట్రీట్ ఇదే!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలజీ్ అయిన ప్రచారం చిత్రాలు సినిమాని ఆకాశం అంచున నిలబెట్టలాయి. మెగాస్టార్ మాస్ ఇమేజ్..శివ సెన్సిబుల్ మార్క్ యాక్షన్ తో `ఆచార్య`పై అంచనాలు మిన్నంటుతున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే హీట్ పెంచేసిన `ఆచార్య` అటుపై ఒక్కొక్కటిగా రెట్టింపు చేసుకుంటూ వచ్చింది.
తాజాగా నేడు శ్రీరామనవమిని పురస్కరించుకుని `ఆచార్య` నుంచి మరో బిగ్ అప్ డేట్ వచ్చేసింది. ఈనెల 12న భారీ ఎత్తున ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఆచార్య ట్రైలర్ ట్రీట్ కేవలం సోషల్ మీడియాకే పరిమితం చేయకుండా బిగ్ స్ర్కీన్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ర్టాల్లో మేజర్ థియేటర్స్ అన్నింటిలో అభిమానుల కోసం ట్రైలర్ ట్రీట్ ఏర్పాటు చేసినట్లు మేకర్స్ కొద్ది సేపటి క్రితమే ప్రకటించారు.
ఇప్పటికే టీజర్ లో తండ్రీ -తనయులు చిరంజీవి..చరణ్ లు రఫ్పాడించేసారు. దీంతో ట్రైలర్ లో ఇద్దరి యాక్షన్ ఇంకేరేంజ్ లో ఉంటుందో? అంటూ అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. ఫాదర్..సన్ శివ మార్క్ యాక్షన్ సన్నివేశాల్లో అలరించడం ఖాయమంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక చిత్రాన్ని అన్ని పనులు పూర్తిచేసి ఇదే నెల 29న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
`ఖైదీ నెంబర్ 150` వ చిత్రంతో కంబ్యాక్ అయిన చిరంజీవి అటుపై స్వాతంత్ర్య సమరయోధుడు `ఉయ్యాలవాడ నరసింహారెడ్డి` బయోపిక్ లో నటించారు. ఈ రెండు చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. కంబ్యాక్ తర్వాత `ఆచార్య` తో హ్యాట్రిక్ అందుకోవాలని చిరు వెయిట్ చేస్తున్నారు. 152వ చిత్రంగా `ఆచార్య` ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
చాలా మంది దర్శకుల్ని పరిశీలించిన తర్వాత చిరు ఆ బాధ్యతల్ని అపజయమెరుగని కొరటాలకి అప్పగించారు. ఇప్పటివరకూ కొరటాల నాలుగు చిత్రాలు తెరకెక్కించారు. అన్నీ బ్లాక్ బస్టరే. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించినవే. దీంతో `ఆచార్య` పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇందులో హీరోయిన్లగా కాజల్ అగర్వాల్..పూజాహెగ్డే నటించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ-మ్యాట్ని ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.