66లో వరుస పార్టీలతో మెగాబాస్ దూకుడేమిటో కానీ!
బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సంతకాలు చేసి ఆలస్యం చేయకుండా లాంచ్ చేయడమే కాదు.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ పార్టీలతో చిలౌట్ చేయడంలోనూ మెగాస్టార్ చిరంజీవి ముందున్నారు. ఆయన పరిశ్రమలో తన సన్నిహితులందరికీ స్పెషల్ పార్టీలు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఆగస్టు 22.. మెగాస్టార్ తన 66 వ పుట్టినరోజును పురస్కరించుకుని పార్టీ మూడ్ లో ఉండడం సర్వత్రా చర్చకు తావిస్తోంది.
ఓవైపు తన సినిమాల టైటిల్స్ ని లాంచ్ చేస్తూ ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సన్నిహితలు బంధుమిత్రులతో ఇండస్ట్రీ వర్గాలతో పార్టీల్లోనూ మునిగి తేలుతున్నారు. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ ఆచార్య రిలీజ్ తేదీపై తర్జనభర్జన సాగుతోంది. అలాగే జయం రాజా లూసిఫర్ రీమేక్ లోనూ నటిస్తున్నారు. ఇంతలోనే మెహర్ రమేష్ తో టైటిల్ ని లాంచ్ చేశారు. బాబీతోనూ స్పెషల్ గ్లింప్స్ ని ప్లాన్ చేశారు. ఇటీవలే టోక్యో ఒలింపిక్స్ లో పతకం సాధించిన స్టార్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధు కోసం ప్రత్యేక సన్మాన విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ విందుకు పలువురు సినీతారలు హాజరైన సంగతి తెలిసిందే. అలాగే ఆడపడుచులతో `వరలక్ష్మి వ్రతం` పూజా కార్యక్రమాన్ని అంతే ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
తన పుట్టినరోజును పురస్కరించుకుని సన్నిహితులతో కలిసి ఓ స్పెషల్ పార్టీని చిరు ప్లాన్ చేశారు. మెగాస్టార్ కి అత్యంత సన్నిహితులకు ఆహ్వానాలు అందాయి. రేపు రాత్రి కూడా మెగాస్టార్ మరో పార్టీకి ప్లాన్ చేశారని తెలిసింది. పరిశ్రమ యువహీరోలు సహా ఔత్సాహిక దర్శకనిర్మాతలకు ఈ పార్టీకి ఆహ్వానం అందుతుందని భావిస్తున్నారు.
ఇలా బ్యాక్ టు బ్యాక్ పార్టీలతో ఇండస్ట్రీలో సహృద్భావాన్ని తేవడం మెగాస్టార్ ఉద్ధేశం కావొచ్చు. ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు అవసరం అంటూ దాసరి లేని లోటును ఎత్తి చూపుతున్న వారికి మునుముందు సమాధానం ప్రాక్టికల్ గానే ఉంటుందని భావించవచ్చు. త్వరలోనే మా అసోసియేషన్ కి ఎన్నికలు జరగనున్నాయి. గెలిచి అధ్యక్ష పదవి చేపట్టిన వారికి ఈసీ కమిటీకి ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేసేందుకు మెగా ఆహ్వానం అందుతుందనడంలో సందేహమేం లేదు.