దాస‌రి ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి?

Update: 2021-08-19 09:30 GMT
మెగాస్టార్ చిరంజీవి దాస‌రి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డ‌మా? దివంగ‌త ద‌ర్శ‌కుడితో పాజిబులేనా? అంటే ఇందులో ఎలాంటి క‌న్ఫ్యూజ‌న్ అవ‌స‌రం లేదు. చిరు తొంద‌ర్లోనే దాస‌రి మారుతి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తార‌ని స‌మాచారం. ఈరోజుల్లో లాంటి చిన్న సినిమాతో కెరీర్ ని ప్రారంభించి మెగా బ్లాక్ బ‌స్ట‌ర్లతో టాలీవుడ్ లో ద‌ర్శ‌క‌నిర్మాత‌గా ఎదిగిన మారుతి ఇప్పుడు చిరుకి క‌థ చెప్ప‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు నుంచి `ప్ర‌తిభావంతుడు` అన్న‌ ప్ర‌శంస‌లు పొందిన మారుతి దాస‌రి ఇప్పుడు మెగా ఛాలెంజ్ కి సిద్ధ‌మ‌వుతుండ‌డం ఆస‌క్తిని పెంచుతోంది.

మెగాఫ్యామిలీ అగ్ర హీరోల‌తో సినిమాలు చేయాల‌ని ద‌ర్శ‌కుడు మారుతి దాస‌రి ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ఆరంభ‌మే త‌న‌కు అవ‌కాశ‌మిచ్చారు. కానీ ఇన్నాళ్లు సేఫ్ గేమ్ ఆడేందుకే ఇష్ట‌ప‌డిన మారుతి పెద్ద హీరోల జోలికి కావాల‌నే వెళ్ల‌లేదు. బ‌న్నీకి క‌థ కూడా చెప్ప‌లేద‌ని అప్ప‌ట్లో అన్నారు.

బ‌న్నితో పాటు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్..మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ల‌తో సినిమాలు చేయాల‌ని ఎప్ప‌టి నుంచో మారుతి భావిస్తున్నా కావాల‌నే వెయిటింగ్ లో ఉన్నారని ప్ర‌చార‌మైంది. మెగా యువ‌హీరోలు అల్లు శిరీష్.. సాయిధ‌ర‌మ్ ల‌తో సినిమాలు తీసి హిట్లిచ్చారు మారుతి. బ‌న్నికి ఇటీవ‌ల ప‌లుమార్లు స్క్రిప్ట్ వినిపించాల‌ని భావించినా ఇంకా ఫైన‌ల్ కాలేద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇంకా ఈ జోడీ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న లేదు.

నేచుర‌ల్ స్టార్ నాని.. విక్ట‌రీ వెంక‌టేష్‌.. వెర్స‌టైల్ స్టార్ శ‌ర్వానంద్ లను డైరెక్ట్ చేసిన మారుతి మెగా కాంపౌండ్ అగ్ర హీరోల‌తో ప‌ని చేయ‌డ‌మే ఇక‌ పెండింగ్. అయితే ఆశించిన దానికి మించి మారుతికి క్రేజీ జాక్ పాట్ త‌గిలింద‌ని స‌మాచారం. అత‌డు ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే డైరెక్ట్ చేసేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌లే మెగాస్టార్ ని క‌లిసి సింపుల్ గా సింగిల్ లైన్ వినిపించిన మారుతికి మెగాస్టార్ నుంచి సానుకూల స్పంద‌న వ‌చ్చింద‌ట‌. వెంట‌నే బౌండ్ స్క్రిప్ట్ తో ర‌మ్మ‌ని పిలిచార‌ని వార్త‌లొస్తున్నాయి.

ప్రస్తుతం మారుతి మెగాస్టార్ ని దృష్టిలో పెట్టుకుని రేయింబ‌వ‌ళ్లు స్క్రిప్ట్ కోసం శ్ర‌మిస్తున్నార‌ట‌. ఎలాగైనా బాస్ తో ఓ సినిమా చేయాల‌ని స‌క్సెస్ అందుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్నార‌ట‌. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ-యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మించే వీలుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. ఏదేమైనా మెగాస్టార్ నే మెప్పించాడంటే అత‌డికి మునుముందు మ‌రిన్ని క్రేజీ ఆఫ‌ర్లు ద‌క్కే ఛాన్సుంటుంది.

నిజానికి మారుతికి తొలి నుంచి మెగా కాంపౌండ్ అండదండ‌లు ఉన్న సంగ‌తి తెలిసిందే. మారుతిలో క్రియేట‌ర్ ని గుర్తించి ప్రోత్స‌హించింది కూడా చిరంజీవినే. ప్ర‌జారాజ్యం పార్టీ జెండా డిజైన్ ఆవిష్క‌ర‌ణ‌తోనే మారుతి మెగాస్టార్ దృష్టిలో ప‌డ్డారు. అప్పుడే మారుతీని క్రియేటివ్ రంగంలో ప్ర‌య‌త్నం చేస్తే స‌క్సెస్ అవుతావ‌ని చిరు ప్రోత్స‌హించారు. ఆ మాట‌ను క‌సిగా తీసుకుని ఇండ‌స్ట్రీ వైపు వ‌చ్చి నేడు ద‌ర్శ‌కుడిగా రాణిస్తున్నారు. త‌న ఆరంభానికి స్ఫూర్తినిచ్చిన‌ మెగాస్టార్ నే డైరెక్ట్ చేయ‌డానికి మారుతి సిద్ధ‌మ‌వుతుండ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని పెంచుతోంది.

ఈరోజుల్లో - బ‌స్ స్టాప్ - భ‌లే భ‌లే మ‌గాడివోయ్ - మ‌హానుభావుడు వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను మారుతి తెర‌కెక్కించారు. అల్లు శిరీష్ తో కొత్త జంట చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌ర్క‌వుటైంది. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు నిర్మాతగానూ కొన‌సాగారు. పంపిణీదారుగానూ మారుతికి అనుభ‌వం ఉంది. స్వ‌త‌హాగా యానిమేట‌ర్ అయిన మారుతి త‌న‌కు బాహుబ‌లి రేంజు సినిమాలు తీసే స‌త్తా ఉంద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో కాన్ఫిడెన్స్ ని వ్య‌క్తం చేయ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. అందివ‌చ్చే అవ‌కాశాన్ని బ‌ట్టి మారుతి దూసుకెళ్లే ప్లాన్ లో ఉన్నారు.




Tags:    

Similar News