న‌యన్ ని నేను అలా అన‌లేదన్న క‌ర‌ణ్

Update: 2022-07-31 15:30 GMT
`కాఫీ విత్ కరణ్` తాజా సీజన్ లో త‌లైవి న‌య‌న‌తార‌ను క‌ర‌ణ్ అవ‌మానించాడంటూ ట్రోలింగ్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. స‌మంత‌తో చాటింగ్ సెష‌న్ లో న‌య‌న్ త‌న లిస్ట్ లో లేద‌ని క‌ర‌ణ్ వ్యాఖ్యానించ‌డంతో ట్రోల‌ర్స్ విరుచుకుప‌డ్డారు. నయనతార అభిమానులు తనను ట్రోల్ చేయడంపై హోస్ట్ కరణ్ జోహార్ తాజాగా స్పందించారు.

ట్రోల‌ర్ల‌కు నేరుగా కరణ్ వివరణ ఇస్తూ.. ``ఓర్మాక్స్ నుండి నా వద్ద ఉన్న జాబితా ప్రకారం... సమంతా నంబర్ 1 స్టార్ అని నేను చెప్పాను. నయనతార అభిమానులు సంభాషణను తప్పుగా అర్థం చేసుకున్నారు. మనమంతా హాస్యాన్ని కలిగి ఉండాలని నేను భావిస్తున్నాను. నాది సరదా కార్యక్రమం`` అని అన్నాడు.

సమంతా రూత్ ప్రభు- అక్షయ్ కుమార్ జోడీగా KWK మూడ‌వ‌ ఎపిసోడ్ లో కరణ్ అడిగిన ఆ ప్ర‌శ్న ఒక ర‌కంగా న‌య‌న్ అభిమానుల‌ను మ‌రిగించింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ క‌థానాయిక‌ ఎవరు? అని సమంతను క‌ర‌ణ్ ప్ర‌శ్నించ‌గా.. ఇటీవల విడుదలైన కత్తువాకుల రెండు కాదల్ గురించి సామ్ ప్రస్తావించింది. నేను ఇటీవ‌లే నయనతారతో సినిమా చేసాను. నయనతార దక్షిణాదిన బిగ్గెస్ట్ స్టార్ అని పేర్కొంది. దానికి కరణ్ వెంటనే బదులిస్తూ...``సరే.. నా జాబితాలో లేదు!`` అని వ్యాఖ్యానించారు. అయితే ఇదంతా అత‌డు చెప్పిన‌ట్టు స‌ర‌దా వ్యాఖ్యానం. కానీ స‌ర‌దా ప‌డితే ఎలా ఉంటుందో న‌య‌న్ అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌లుగా తీర్పు చెప్పారు. న‌య‌న్ ఒక్కో సినిమాకి 6 కోట్ల పారితోషికం అందుకుంటూ అగ్ర హీరోల‌ రేంజులో వెలిగిపోతోంది. ఇండ‌స్ట్రీ అగ్ర‌ హీరోలంద‌రికీ క‌థానాయిక‌గా కొన‌సాగుతోంది న‌య‌న్. త‌న‌ను నంబ‌ర్ వ‌న్ సౌత్ నాయిక అంటే త‌ప్పేమీ కాదు.
Tags:    

Similar News