మాయాపేటిక ఎలా ఉంది..?

Update: 2023-06-30 18:04 GMT
అనసూయతో థ్యాంక్యు బ్రదర్ సినిమా చేసిన రమేష్ రాపర్తి దర్శకత్వంలో వచ్చిన సినిమా మాయా పేటిక. సినిమా టీజర్, ట్రైలర్ ఫన్నీగా అనిపించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాయల్ రాజ్ పుత్ సినిమాలో ఉందని బాగానే ప్రమోట్ చేశారు. ఇంతకీ అసలేంటి ఈ సినిమా కథ అంటే.. హీరోయిన్ గా చేసే పాయల్ రాజ్ పుత్ ఫోన్ పోవడం వల్ల ఆమెకు నిర్మాత కొత్త ఫోన్ గిఫ్ట్ గా ఇస్తాడు. దాంతో ఆమె పెళ్లి చేసుకునే అతనితో గొడవలు అవుతాయి. అందుకే ఆమె అసిస్టెంట్ కి ఫోన్ ఇస్తుంది. ఆ ఫోన్ అలా చేతులు మారుతూ పాకిస్తాన్ దాకా వెళ్తుంది. ఇంతకీ ఆ ఫోన్ అలా ఎందుకు చేతులు మారింది. దాని వల్ల ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చాయి. వాటిని ఎవరు ఎలా పరిష్కరించారు అన్నది కథ.

హీరోయిన్ కథగా మొదలైన మాయా పేటిక సినిమా మొత్తం ఆరు కథలతో వచ్చింది. అయితే ఒక కథకి మరో కథకు సంబంధం ఉండదు. ఇది ఒక యాంథాలజీగా తీశాడని చెప్పొచ్చు. కథ బాగున్నప్పటికీ కథనం లో చాలా లోటు పాట్లు కనిపిస్తాయి. పాత్రధారులంతా కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సునీల్, శ్యామలా, విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్ ఇలా వారికి ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.

కథ ఒక్కటి రాసుకుంటే సరిపోదు అందుకు తగినట్టుగా కథనం ఉండాలి. మాయా పేటిక సినిమా విషయంలో కథనం గాడి తప్పింది. అయితే దర్శకుడు కొన్ని కథలను బాగానే చెప్పే ప్రయత్నం చేసినా చాలా చోట్ల ప్రేక్షకులకు బోర్ కొట్టించాడు. ఇక పాయల్ రాజ్ పుత్ పాత్ర నిడివి తక్కువగా ఉందని అనిపిస్తుంది. ఆమె పాత్ర ఇంకాస్త ఉంటే బాగుంటుంది. థ్యాంక్యు బ్రదర్ సినిమా విషయంలో కూడా దర్శకుడు అనుకున్న కథ బాగున్నా ఎగ్జిక్యూషన్ వల్ల సినిమా వర్క్ అవుట్ అవలేదు.

ఇప్పుడు మాయా పేటిక విషయంలో కూడా అదే తప్పు చేశాడు దర్శకుడు. ఆరు కథలతో సినిమాగా కాకుండా యాంథాలజీగా వచ్చిన మాయా పేటిక ఆడియన్స్ ను ఆశించిన స్థాయిలో ఎంటర్టైన్ చేయలేదని చెప్పొచ్చు.   

Similar News