లాక్ డౌన్ లో లాభపడ్డ మాస్ మహారాజ్..!
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ గత కొంతకాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. రవితేజ నటించిన 'రాజా ది గ్రేట్' సినిమా తర్వాత వరుసగా 'టచ్ చేసి చూడు' 'నేల టికెట్' 'అమర్ అక్బర్ ఆంటోనీ' 'డిస్కో రాజా' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని అందుకున్నాయి. మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలనే కసితో 'క్రాక్' మూవీ చేస్తున్నాడు రవితేజ. లాక్ డౌన్ కారణంగా లేట్ అవుతూ వచ్చిన ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ లో సినిమాలన్నీ ఓటీటీలో రిలీజ్ చేస్తున్న సమయంలో 'క్రాక్' సినిమాకు అనేక మార్లు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి ఆఫర్లు వచ్చినా నిర్మాత మధు మాత్రం ఈ సినిమాను డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేయలేదు.
ఒకవేళ ఓటిటిలో 'క్రాక్' సినిమా రిలీజై ఆ రిజల్ట్ ఎలా వస్తుందనే విషయాన్ని పక్కన పెడితే వరుస డిజాస్టర్స్ కారణంగా పడిపోయిన రవితేజ హిందీ మార్కెట్ లాక్ డౌన్ లో మళ్లీ పుంజుకుందని తెలుస్తోంది. రవితేజ 'క్రాక్' తో పాటు ఆ తరువాత వచ్చే 'ఖిలాడీ' సినిమాలకి ఫ్యాన్సీ రేట్లు ఇచ్చి మరీ హిందీ రైట్స్ కొనుక్కొని వెళ్లిపోయినట్లుగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏదేమైనా లాక్ డౌన్ లో మిగతా వాళ్లకంటే లాభపడ్డ హీరో అంటే రవితేజ నే అని చెప్పుకుంటున్నారు. 'రాక్షసుడు' ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఖిలాడీ' చిత్రాన్ని హవీష్ ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు.