మెగాస్టార్ చేతుల మీదుగా 'శ్రీదేవి సోడా సెంటర్' మాస్ కా బాస్ 'మందులోడా' సాంగ్..!

Update: 2021-07-07 13:30 GMT
టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''శ్రీదేవి సోడా సెంటర్''. 'పలాస 1978' ఫేమ్ కరుణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సుధీర్ బాబు ఇంతకుముందెన్నడూ చేయని డిఫరెంట్ పాత్రలో.. లైటింగ్ బాయ్ సూరిబాబుగా కనిపించనున్నాడు. ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు - ఫస్ట్ గ్లిమ్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా ప్రమోషన్స్ ను ఓ మాస్ సాంగ్ తో ప్రారంభించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.

'మందులోడా' అనే మాస్ కా బాస్ సాంగ్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్యాన్స్ అంటే మెగాస్టార్ చిరంజీవి గుర్తుకు వస్తారని పేర్కొన్న చిత్ర యూనిట్.. ఈ మాస్ సాంగ్ ను బిగ్ బాస్ చేతుల మీదుగా విడుదల చేయిస్తున్నట్లు వెల్లడించారు. జూలై 9(శుక్రవారం) ఉదయం 9 గంటలకు 'మందులోడా' పాటను చిరు రిలీజ్ చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో సుధీర్ బాబు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నాడు. దీనికి సంగీత బ్రహ్మ మణిశర్మ మాస్ ఆడియన్స్ ని ఉర్రుతలూగించే ట్యూన్ ని కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి యష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రానికి శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 70MM ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీరు గతంలో సుధీర్ బాబుతో 'భలే మంచి రోజు' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. టైటిల్ తోనే సినిమాపై బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. మంచి ప్రీ రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ ను జీ నెట్ వర్క్ గ్రూప్ వారు ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసినట్లు సమాచారం. నాన్-థియేట్రికల్ రైట్స్ దాదాపు 9 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయాయని టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే సుధీర్ బాబు సినిమా రిలీజ్ కు ముందే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న సూపర్ స్టార్ అల్లుడికి 'శ్రీదేవి సోడా సెంటర్' ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News