ఆ డైరెక్టర్ తీసేది 'బాహుబలి' రేంజ్ సినిమా అనుకుంటున్నాడా...?
ప్రస్తుతం టాలీవుడ్ లో మాస్ సినిమాలు తీసే దర్శకులు తక్కువగా ఉన్నారు. ఒకరిద్దరు మాస్ డైరెక్టర్లు కూడా తమ పంధా మార్చి ట్రెండుకి తగ్గట్టు సినిమాలు తీసుకుంటూ పోతున్నారు. కానీ ఒక డైరెక్టర్ మాత్రం మాస్ మసాలా సినిమాలు తీసుకుంటూ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ డైరెక్టర్ ప్రస్తుతం ఒక సీనియర్ హీరోతో సినిమా ప్లాన్ చేసాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. ఇప్పటికే ఈ సినిమాలో ఆ హీరోని గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా చూపించబోతున్నానంటూ అభిమానుల్లో అంచనాలు పెంచేసాడు. అయితే ఆ హీరో గత సినిమాలు ఘోర పరాజయాన్ని చవి చూశాయి. ఇక మరోవైపు దర్శకుడు కూడా హిట్టు రుచి చూసి చాలా కాలమవుతోంది. కానీ వీరి కలయికలో గతంలో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సొంత చేసుకున్నాయి. అందుకే హిట్ కాంబినేషన్ ద్వారా ఇద్దరూ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు.
ఇదిలా ఉండగా ఆ మాస్ డైరెక్టర్ కొన్నిసార్లు అనుకున్న బడ్జెట్ కంటే హై రేంజ్ లో సినిమాను డిజైన్ చేస్తారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. అవసరానికి మించి ఖర్చు పెట్టిస్తాడనే అపవాదు ఉంది. కానీ అప్పుడప్పుడు సినిమా మార్కెట్ పరిధి కూడా చూసుకోవాలి.. కరోనా ఎఫెక్ట్ లాంటివి ఆలోచించాలి కదా. అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా డైరెక్టర్ బడ్జెట్ పెంచే ఛాన్స్ ఉందంట. ఈ డైరెక్టర్ తన సినిమాలను అవసరం లేకున్నా భారీ తారాగణంతో తెరకెక్కిస్తుంటాడు. అంతేకాకుండా ఈ సినిమాని ఫారిన్ లొకేషన్స్ లో.. మంచు పర్వతాలలో ప్లాన్ చేసాడట. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఫారిన్ కాదు కదా స్టేట్ దాటిపోయే పరిస్థితి లేదు. దీంతో ఇక్కడే సెట్స్ వేసి తీయాలనుకుంటున్నాడట. కరోనా వల్ల అందరూ సినిమా బడ్జెట్ లెక్కలు తగ్గించే ఆలోచనలో ఉంటే ఈ దర్శకుడు మాత్రం తగ్గడం లేదట. దీంతో నువ్వు తీసేది 'బాహుబలి' రేంజ్ సినిమా అనుకుంటున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.