వాస్తవమైన కలకు తాళం కడితే..

Update: 2017-05-28 12:13 GMT
తెలుగు చిత్ర పరిశ్రమ లో ఒక కాంబినేషన్ ఎప్పటికీ మరుపురానిది. ఇళయరాజా – వంశీ యుగళ గీతాలు అంటే టాప్ నాచ్ అంతే. 80వ 90వ దశకంలో వంశీ సినిమాలుకు ఇళయరాజా పాటలుకు ఉన్న క్రేజ్ గురించి ఇప్పటి వీడియో గేమ్ కుర్రాళ్ళను అడిగినా చెబుతారు. ఇప్పుడు వంశీ గారు  డైరెక్ట్ చేస్తున్న ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్ సినిమా జూన్ 2 న విడుదల అవుతుంది. ఈ సినిమాకు సంగీతం మణి శర్మ అందిస్తున్నాడు.

''వంశీ గారితో నేను ఎప్పటినుండో చెయ్యాలి అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. ఎందుకు ఇంత టైమ్ పట్టిందో నాకు తెలియదు. ఆయన సినిమాకు మ్యూజిక్ ఇవ్వడం అంటే  వాస్తవమైన కలకు తాళం కట్టడమే. అతని పాటలలో ఉండే సెట్ లానే ఆయన ఆలోచనలు కూడా ఆహ్లాదకరంగా ఉంటాయి. కానీ లేడీస్ టైలర్ కు ఫ్యాషన్ డిజైనర్ కు ఎటువంటి సంబంధం ఉండదు. దానికి ఇళయరాజా గారు ఇచ్చారు దీనికి నేను ఇచ్చాను. రాజ గారి స్థాయిలో నేను పాటలు ఇవ్వకపోయినా అందరికీ గుర్తుండి పోయేలా ఇచ్చాను'' అంటున్నాడు మణి. అసలు ఒక స్టార్ మ్యూజిక్ డైరక్టర్ అయ్యుండీ.. నేను రాజా గారి స్థాయిని టచ్ చేయలేదు అని చెప్పడం మణిశర్మకే చెల్లింది.

అప్పటి సినిమాలుకూ ఇప్పటి సినిమాలుకూ తేడా ఏమి గమనించారు అంటే.. “అప్పుడు పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంటే సినిమా హిట్ అయ్యేవి. ఇప్పుడు కధ బాగుంటే చాలు పాటలు బాగా లేకున్న హిట్ అవుతున్నాయి” అని చెప్పాడు. ఈ ఫ్యాషన్ డిజైనర్ సినిమాను మధుర శ్రీధర్ నిర్మించారు. ఈ సినిమా పాటలు కూడా ఈ మధ్యనే విడుదలై మంచి విజయాన్ని పొందాయి. మరి సినిమా రిజల్టుపై ఈ పాటల ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News