టైటిల్ అదిరింది.. ఫసక్!

Update: 2018-12-13 05:17 GMT
ఎవ్వరూ పుట్టించకపోతే పదాలెలా పుడతాయని ఒక సీనియర్ తెలుగు రైటర్ అనేవారట. నిజమే.  'నీ యంకమ్మ'.. 'జంబలకిడి పంబ'.. 'ఎన్న చాట' వీటన్నిటికీ అర్థాలు ఎవరు చెబుతారు? అర్థం తెలిసినా తెలియకపోయినా అవి తెలుగువారి జీవితాల్లో.. వాడుక భాషలో భాగం అయిపోయాయి. ఇక తాజాగా సీనియర్ నటుడు... నిర్మాత మోహన్ బాబు ఈ లిస్టుకు 'ఫసాక్' అనే కొత్త పదాన్ని జోడించాడు.

ఈ పదప్రయోగానికి చాలామంది వెర్రెత్తిపోయారు. సోషల్ మీడియా కకావికలం అయింది. అటూ తెలుగు కాక ఇటూ ఇంగ్లిష్ కాకుండా మంచువారు తెలుగు భాషకు కొత్త పదాన్ని అందించారు.  తెలుగులో నటిస్తున్న ఒక నార్త్ హీరోయిన్ ఒక ట్వీట్ లో "అసలు ఫసాక్ ఏంటి?" అని అడిగిందంటే ఫసాక్ ఎంత పాపులర్ అయిందో మనం అర్థం చెసుకోవచ్చ్.  ఇక మంచు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫసాక్ స్పూఫుల పై ఎంతో జోవియల్ గా స్పందించారు.  తాజాగా ఈ 'ఫసాక్' ను మంచు విష్ణు ఇంకో రేంజ్ కి తీసుకెళ్ళాడు.

మంచు సొంత బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై 'ఫసాక్' టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. నాన్నగారు కనిపెట్టిన పదం పై కొడుకులకు ఫుల్ పేటెంట్ రైట్స్ ఉంటాయని అనుకునే మీరు పపులో కాలేసినట్టే.  ఎందుకంటే ఫిలిం చాంబర్ తాజా రూల్స్ ప్రకారం రిజిస్టర్ చేసిన తర్వాత 90 రోజుల లోపు ఆ టైటిల్ తో షూటింగ్ మొదలు పెడితేనే వారికి సొంతం.. లేకపోతే ఆ టైటిల్ ఫసాక్ అవుతుంది!
Tags:    

Similar News