మాజీ భ‌ర్త గురించి మ‌లైకా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Update: 2022-10-03 01:30 GMT
మ‌లైకా అరోరా-అర్జున్ రాంపాల్ ప్రేమాయాణం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రు ఎంతో సీరియ‌స్ గా డేటింగ్ లో ఉన్నారు. వివాహ బంధంతోనూ ఒక‌టి కాబోతున్న‌ట్లు ప్రచారం సాగుతోంది. ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌సు వ్య‌త్యాసం భారీగా ఉన్నా త‌మ ప్రేమ‌కి అవేం అడ్డంకి కాద‌ని య‌మా వేగంతో దూసుకుపోతున్నారు. ప్రేమ ప‌క్షుల విహారం చూస్తే? ఇద్ద‌రి మ‌ధ్య అన్యోన్య‌త చూస్తే చ‌రిత్ర‌లోనే ఇంత గొప్ప ప్రేమికులేరా? అనిపిస్తుంది.

ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెట్టి మ‌లైకా పాస్ట్ లైఫ్ లోకి ఓసారి వెళ్తే...అమ్మ‌డు ఆర్భాజ్ ఖాన్ ని  ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ జంట‌కు 19 ఏళ్ల కుమారుడు ఆర్హాన్ ఖాన్ ఉన్నాడు.  అయితే వివాహ బంధానికి ఆ జంట 2017లో స్వ‌స్తి ప‌లికింది. ఆ త‌ర్వాత ఎవ‌రి జీవితాలు వారివి. కుమారుడు కోసం స్నేహితులు గా క‌ల‌వ‌డం మినహా ఎలాంటి రిలేష‌న్  షిప్  క‌నిపించ‌లేదు.

ఓ ఇంట‌ర్వ్యూలో మాజీ భ‌ర్త గురించి ట‌చ్ చేస్తే ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చింది.  ఇద్ద‌రం విడిపోయాక జీవితం ప‌ట్ల అవ‌గాహ‌న పెరిగింది. మ‌రింత మెరుగ్గా ఆలోచించ గ‌ల్గుతున్నాం. ఎవ‌రి జీవితాల్లో వారికి న‌చ్చిన‌ట్లు బ్రత‌కడ‌మే జీవితం. జీవితంలో సంతోషం వెదుక్కోవాల‌ని ఇద్ద‌రు క‌లిసి విడాకుల నిర్ణ‌యం తీసుకున్నాం. విడాకుల ప్ర‌పోజ‌ల్ నాదే.

మ‌న‌సుకు న‌చ్చిన నిర్ణ‌యాలు తీసుకోవడంలో ఆల‌స్యం చేయ‌కూడ‌దు. ఇబ్బందులు స‌హ‌జం. వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్లాలి. ఒకే స‌మ‌యంలో అంద‌ర్నీ సంతోష పెట్ట‌లేం. కొన్ని నిర్ణ‌యాలు క‌ఠినంగా ఉన్నా..వాటిని స్వాగ‌తించ‌క త‌ప్ప‌దు. ఆర్భాజ్ చాలా మంచి వ్య‌క్తి. అత‌ను ఎప్పుడు సంతోషంగా ఉండాలి. కానీ మాదారులు వేర‌వ్వ‌డంతో దూర‌మ‌య్యాం.

కుమారుడితో ఆర్భాజ్ కి మంచి బాండింగ్ ఉంది.  త‌న నిర్ణ‌యాలు గౌర‌విస్తాడు. తాను సంతోషంగా ఉంటే అర్భాజ్ ఆనందిస్తాడు. నాన్న అంటే అర్హాన్ అంతే గౌర‌విస్తాడు. ఎంతో సంతోష‌ప‌డ‌తాడు` అని చెప్పుకొచ్చింది. అర్హాన్ ఖాన్ విదేశాల్లో చ‌దువుకుంటున్నాడు. అప్పుడ‌ప్ప‌డు ఇండియాకి వ‌స్తుంటాడు. ఆ స‌మ‌యంలో మ‌లైకా-ఆర్భాజ్ ఖాన్ జంట‌గా ఎయిర్ పోర్ట్ కి వెళ్లి పిక్ చేసుకుంటారు.  అర్హాన్ ఇండియాలో ఉన్నంత కాలం ఆ మాజీలిద్ద‌రు స్నేహితులుగా ఉంటారు. మ‌రోవైపు అర్జున్ రాంపాల్ తో ప్రేమాయ‌ణం అంతే సంతోషక‌రంగా సాగుతుంది.
Tags:    

Similar News