డ్యాన్స్ రియాలిటీలో డ్యాన్సింగ్ క్వీన్ మెరుపులు

Update: 2020-07-24 06:30 GMT
బుల్లితెర రియాలిటీ షోల్లో డ్యాన్స్ బేస్డ్ రియాలిటీ షోల‌కు ఉండే ఆద‌ర‌ణ క్రేజు ఎప్ప‌టికీ త‌గ్గ‌దు. ఈ త‌ర‌హా షోల‌కు ప్ర‌ఖ్యాత సోనీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ఎంత‌గా పాపుల‌రైందో తెలిసిందే. ఇటు తెలుగు బుల్లితెర‌పైనా రెగ్యుల‌ర్ గా డ్యాన్స్ రియాలిటీ షోల‌కు ప్రాధాన్య‌త పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేదు. ఇక్క‌డ ప్రియ‌మ‌ణి- స‌దా- శేఖ‌ర్ మాస్టార్ - జానీ మాస్టార్- రాజు సుంద‌రం - సుంద‌రం మాస్టార్  ఇలా చాలా మంది జ‌డ్జీలుగా కొన‌సాగుతున్నారు.

తాజాగా సోనీ వాళ్ల రియాలిటీ టీవీ షో అప్ కం ఎపిసోడ్ షూటింగ్ పండ‌గ వాతావ‌ర‌ణాన్నే త‌ల‌పించింది. ఈ డ్యాన్స్ బేస్డ్ రియాలిటీ షోకి ఇండియా బెస్ట్ డాన్సర్ మలైకా అరోరాఖాన్ తిరిగి జడ్జిగా జాయిన్ అయ్యారు. ఈ వారాంతంలో ఎపిసోడ్ కి ప్రిప‌రేష‌న్స్ సాగుతున్నాయి. వీటి ఎంపిక‌ల్లోనూ మ‌లైకా బిజీ బిజీ.

తాజాగా పార్టిసిపెంట్ ఒక‌రు వేదికపైకి వచ్చి పాప్ క్లాసిక్ `పియా తు అబ్ తోహ్ ఆజా` పాట‌కు ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌గా.. మలైకా థ్రిల్లింగ్ మూవ్ మెంట్ క‌ట్టిప‌డేస్తోంది. భారతదేశపు ఉత్తమ నృత్యకారిణి తిరిగి ఈ రియాలిటీ టీమ్ తో జాయిన్ కావ‌డం ఎంతో గొప్పగా అనిపించింది. ఇక ఈ రియాలిటీ కోసం పియాతూ పాట‌కు పార్టిసిపెంట్ చేసిన పెర్ఫామ‌ర్ ని మ‌లైకా ప్ర‌శంసించారు. మన జీవితకాలంలో ఈ పాటను మనమందరం ఒక్కసారి అయినా విని ఉంటామ‌ని అన్నారు. ఇక ఇలాంటి షోల నుంచి పాపుల‌రై ఇప్పుడు అగ్ర హీరోయిన్ గా ఏల్తోంది సాయి ప‌ల్ల‌వి. ఇంకా ఎంద‌రో డ్యాన్స్ రియాలిటీ షోల నుంచి కొరియోగ్రాఫ‌ర్లుగా ఎదిగిన వారు ఉన్నారు.
Tags:    

Similar News