ముంబయి శివారులో కారు యాక్సిడెంట్.. గాయాలతో హాస్పిటల్ కు మలైకా
చేతిలో సినిమాలు లేకున్నా.. తరచూ వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి మలైకా అరోరా మరోసారి వార్తల్లోకి వచ్చారు. కాకుంటే.. ఈసారి సినిమాలు.. గాసిప్పులతో సంబంధం లేని అంశం. పూణెలో జరుగుతున్న ఒక కార్యక్రమానికి కారులో వెళుతున్న ఆమె కారు ప్రమాదానికి గురైంది. దీంతో కొద్దిపాటి గాయాలైన ఆమె ఆసుపత్రికి వెళ్లారు. ప్రమాదకరమంటూ ఏమీ లేదని.. కాకుంటే దెబ్బలకు చికిత్స చేస్తూ ఆసుపత్రిలో ఉంచినట్లుగా చెబుతున్నారు.
శనివారం రాత్రి వేళలో జరిగిన ఈ ప్రమాదం నుంచి మలైకా సేఫ్ గా బయటపడినట్లేనని తెలుస్తోంది. ఫూణెలో ఒక ఫ్యాషన్ ఈవెంట్ కు హాజరు కావటానికి ఆమె కారులో బయలుదేరారు. ముంబయి శివారులో కారు వెళుతున్న వేళలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మూడు కార్లు వరుసగా ఢీ కొన్నట్లుగాగా చెబుతున్నారు. కారు ప్రమాదం నిజమేనని.. అలా అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మలైకా సోదరు అమ్రితా వెల్లడించారు. ఒక మీడియా సంస్థతో మాట్లాడిన సందర్భంలో ఆమె మలైకా కారుయాక్సిడెంట్ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.
ముంబయి - ఫూణె ఎక్స్ ప్రెస్ హైవేలో ఈ ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు. ప్రమాదానికి గురైన మూడు కార్లు డ్యామేజ్ అయ్యాయని.. ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. విచారణ షురూ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఏమైనా.. పెద్ద ప్రమాదం నుంచి మలైకా త్రుటిలో తప్పించుకున్నారని చెబుతున్నారు. ఏమైనా.. ప్రమాదం నుంచి చిన్న గాయాలతో బయటపడిన వైనం తెలుసుకున్న ఆమె అభిమానులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు.