బాలీవుడ్ నటుల్లో ‘హోమో’లు ఎక్కువ

Update: 2018-07-13 06:41 GMT
దేశవ్యాప్తంగా ఇప్పుడు స్వలింగ సంపర్కం పై చర్చ మొదలైంది. స్వలింగ సంప్కర నేరం కాదని తేల్చాలని తాజాగా సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలైంది. స్వలింగం సంపర్కం నేరమని తెలియజేసే ఆర్టికల్ 377ని రద్దు చేయాలంటూ ఎల్.జీ.బీ.టీ (లెస్బియన్ - గేస్ - బై సెక్స్ వల్స్ - ట్రాన్స్ జెండర్స్) కమ్యూనిటీ తరఫున సుప్రీంలో దాఖలైన పిటీషన్ ను  విచారణకు స్వీకరించారు. దీంతో ఇప్పుడు దీనిపై దేశవ్యాప్తంగా చర్చోపచర్చలు సాగుతున్నాయి.

ఎల్.జీ.బీ.టీకి మద్దతుగా  సెలెబ్రెటీలు ఇషా గుప్తా - ఓనిర్  - ప్రియా మాలిక్ - నకుల్ మెహతాలు ట్వీట్ చేశారు. తాజాగా ఈ అంశంపై బాలీవుడ్ నటి మహికా శర్మ బాంబు పేల్చింది. బాలీవుడ్ లో చాలామంది నటీనటులు - సూపర్ స్టార్లు హోమో సెక్స్ వల్స్ అని సంచలన వ్యాఖ్యలు చేసింది. ముంబైతోపాటు బాలీవుడ్ లో   ఎల్.జీ.బీ.టీ కమ్యూనిటీ విస్తరించిందని.. అందులో తప్పేమీ లేదని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన సెక్షన్ 377ను రద్దు చేసి, స్వలింగ సంపర్కానికి ఆమోదం పలకాలని డిమాండ్ చేసింది.. ముంబైతోపాటు వినోదరంగంలో ఉన్న చాలామంది నటులు హోమో సెక్స్ వల్సేనని.. వారు తనకు తెలుసునని షాకింగ్ కామెంట్స్ చేసింది.

 ‘‘ఇక మన దేశంలో హంతకులను - అత్యాచారాలకు పాల్పడే వారికి చాలా స్వేచ్ఛ ఉందని.. హోమో సెక్స్ వల్స్ కు మాత్రం లేదని’’ మహికా ఆవేదన వ్యక్తం చేసింది. సెక్షన్ 377ను రద్దు చేసి హోమో సక్సెవల్స్ కు స్వేచ్ఛ లభించేలా చూడాలని ఆమె డిమాండ్ చేసింది.  మహికా శర్మ.. పలు టీవీ సీరియళ్లలో - సినిమాల్లో నటించి పాపులర్ అయ్యింది. ఈ సందర్భంగా ఈమె బాలీవుడ్ నటులపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
Tags:    

Similar News