మే 31న మహేష్‌ నుండి ప్రకటన రాబోతుందా?

Update: 2020-05-16 04:30 GMT

మహేష్‌ బాబు తదుపరి చిత్రం విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. మే 31వ తారీకున ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అవ్వబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. సూపర్‌ స్టార్‌ కృష్ణ బర్త్‌ డే సందర్బంగా మహేష్‌ బాబు మూవీ లాంచింగ్‌ అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సమయం లో మహేష్‌ బాబు సన్నిహితల నుండి కీలక విషయం తెలిసింది.

కృష్ణ బర్త్‌ డే సందర్బంగా మహేష్‌ బాబు మూవీ అఫిషియల్‌ అనౌన్స్‌ మెంట్‌ రాబోతుంది. ఆ అనౌన్స్‌ మెంట్‌ స్వయంగా మహేష్‌ బాబు చేసే అవకాశం ఉందని అంటున్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం అంటూ మహేష్‌ బాబు చేయబోతున్న ఆ ప్రకటన కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. త్వరలోనే సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభం అవ్వబోతుందట.

గీత గోవిందం చిత్రం తర్వాత పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న మూవీ ఇదే కావడం విశేషం. ఇక మహేష్‌ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత తన తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయాలనుకున్నా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది. దాంతో దర్శకుడు పరశురామ్‌ లైన్‌ లోకి వచ్చాడు. ఒక మెచ్యూర్డ్‌ లవ్‌ స్టోరీతో ఈ సినిమా రూపొందుతున్నట్లుగా సినీ వర్గాల్లో  టాక్‌ వినిపిస్తుంది. మహేష్‌ ప్రకటనతో ఏ విషయమైనది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News