సంక్షోభంలోనూ సంపాద‌న.. ద‌టీజ్ మ‌హేష్

Update: 2020-07-23 05:15 GMT
ఓవైపు దేశం మొత్తం సంక్షోభంలో ఉంది. వైర‌స్ మ‌హ‌మ్మారీ విల‌య‌తాండ‌వం కొన‌సాగుతోంది. అన్ని మెట్రోల్ని వైర‌స్ అట్టుడికిస్తోంది. మ‌రోవైపు తెలుగు రాష్ట్రాల్లో ప‌రిస్థితి అంత‌కంత‌కు దారుణంగా మారుతోంది. ఈ ప‌ర్య‌వ‌సానం థియేట‌ర్ల రంగంపైనా సినిమా రంగంపైనా దారుణంగా ప‌డింది. ఒక‌ర‌కంగా పూర్తిగా నాశ‌నం చేసింది.

అయినా అత‌డికి లెక్క లేదు. ఈ సంక్షోభం ఏదీ ఆ స్టార్ హీరోని ఆప‌లేదు. స‌రిక‌దా.. ఆదాయం పెరుగుతోందే కానీ త‌ర‌గ‌లేదు. ఇంత‌కీ ఎవరు ఆ స్టార్ హీరో? అంటే.. ఇంకెవ‌రు.. సూప‌ర్ స్టార్ మ‌హేష్‌. సంక్షోభం వ‌ల్ల అత‌డు న‌టించాల్సిన సినిమా వాయిదా ప‌డింది కానీ.. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు ఏమాత్రం త‌గ్గ‌లేదు. వ‌రుస‌గా ఒక్కో డీల్ కి సంత‌కం చేస్తూ అత‌డు అంత‌కంత‌కు వేడి పెంచుతూనే ఉన్నాడు.

ఇప్ప‌టికే ప్ర‌ముఖ కార్పొరెట్ బ్రాండ్ల‌కు సంత‌కాలు చేసి కాంట్రాక్టులు కుదుర్చుకుని భారీగా ఆర్జిస్తున్న మ‌హేష్ లేటెస్టుగా  రిల‌య‌న్స్ జియో బ్రాండ్ ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ డీల్ విలువ కోట్ల‌లో ఉంటుంద‌ని తాజాగా ఫిలింన‌గ‌ర్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. జియో - అమెరికా కంపెనీల‌ భాగ‌స్వామ్య ఒప్పందంతో ముఖేష్ అంబానీ ప్ర‌పంచంలోనే టాప్ 5 ధ‌న‌వంతుల జాబితాలో చేరాడు. ఇదే స్పీడ్ లో బ్రాడ్ బ్యాండ్ ని దేశంలోని ప‌ల్లెప‌ల్లెనా విస్త‌రించే ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో మ‌హేష్ లాంటి సూప‌ర్ స్టార్ జియోకి ప్ర‌చారం చేస్తే అది ఏపీ-తెలంగాణ ప‌ల్లెల్లో క‌లిసొచ్చే అంశ‌మే. అందుకే ఆ దిశ‌గా ఒప్పందం సాగింద‌ట‌.

మొత్తానికి సంక్షోభం సంక్షోభ‌మే.. సంపాద‌న సంపాద‌నేన‌ని నిరూపించాడు మ‌హేష్‌. రిలయన్స్ కు విదేశీ కంపెనీల నుంచి 1.75 లక్షల కోట్ల పెట్టుబడులు అప్ప‌నంగా వ‌చ్చి చేరిన సంగ‌తి తెలిసిందే. తాజా డీల్ తో ఇరు కంపెనీలు బ‌ల‌ప‌డ‌డ‌మే గాక లాభ‌ప‌డ‌నున్నాయి. జియో బ్రాండ్ ప్ర‌స్తుతం కొన్ని కొత్త ఫీచర్లను రూపొందించడానికి సిద్ధంగా ఉంది. మ‌హేష్ తో వాణిజ్య ప్రకటన త్వరలో చిత్రీకరించనున్నార‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News