• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లిస్టులో కనీసం మహేష్ బాబు...

లిస్టులో కనీసం మహేష్ బాబు పేరు కూడా లేదా..?

By - Tupaki Desk
Update: 2020-03-19 02:30 GMT
ప్రముఖ వార్తాపత్రిక 'హైదరాబాద్ టైమ్స్' ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా "మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఆఫ్ 2019" జాబితాను విడుదల చేసింది. మహిళల విభాగం లో హీరోయిన్ సమంత మొదటి స్థానాన్ని పొందగా, మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా విజయ్ దేవరకొండ ప్రథమ స్థానంలో వరుసగా రెండోసారి నిలవడం విశేషం. అయితే హైదరాబాద్ టైమ్స్ విడుదల చేసిన 30మంది 'మోస్ట్ డిజైరబుల్ మ్యాన్' లిస్టులో సూపర్ స్టార్ మహేష్ బాబు లేదు. అవును మీరు చదివింది నిజమే.

మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా విజయ్ దేవరకొండ ఎంపికయ్యాడు ఓకే. కానీ అసలు 2012, 2013, 2015 సంవత్సరాలలో నెం.1 గా నిలిచిన మహేష్ బాబును లిస్టులోనే లేకుండా చేయడమే షాకింగ్. మహేష్ బాబు 2013లో ఇండియాకే మోస్ట్ డిజైరబుల్ పర్సన్, అలాంటి సూపర్ స్టార్ ని లిస్టులో నుండి తీసేయడం దారుణం అంటూ అభిమానులు బేజారవుతున్నారు. విజయ్ దేవరకొండ నెం.1 అయ్యాడు సరే కానీ మహేష్ బాబు పేరు కనీసం ముప్పై మంది లిస్టులో ఉండాలి కదా.. అని మహేష్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

ఈ ప్రశ్నకు హైదరాబాద్ టైమ్స్ పత్రిక ఇలా సమాధానమిచ్చింది. "నిజానికి సూపర్ స్టార్ మహేష్ బాబును మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ లిస్ట్ నుండి తప్పించడానికి కారణం, ఆయన ఆల్రెడీ 'ఫరెవర్ డిజైరబుల్' లిస్టులో చేరడమే. ఇండియా లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమిర్ ఖాన్ ల తర్వాత మహేష్ బాబుకే అందులో స్థానం దక్కింది. ఫరెవర్ డిజైరబుల్ లో చేరారు కాబట్టే ఇయర్లీ ఒకసారి మారే మోస్ట్ డిజైరబుల్ లిస్టులో నుండి ఆయన పేరును తొలగించినట్లు పత్రిక తెలిపింది. అంతేగాని ఈ విషయంలో మహేష్ అభిమానులు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదంటూ చెప్పడం కొసమెరుపు.
Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Tollywood news 
  • Breaking News 
  • Latest News 
  • Tupaki News 
  • Tupaki Latest News 
  • Tupaki Updates 
  • mahesh babu 
  • hyderabad times 
  • forever desirable 

Similar News

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

Copyright @2026

Powered by Blink CMS