భీష్మ డైరెక్టర్ తో మహేశ్ కొత్త సినిమా? స్టోరీకి ఫిదా అయిన ప్రిన్స్..!
‘భీష్మ’ చిత్రంతో బ్లాక్‌బ్లస్టర్ అందుకున్న డైరెక్టర్ వెంకీ కుడుములకు ఓ బంపర్ ఆఫర్ వచ్చిందట. వెంకీ చెప్పిన కథ నచ్చి అతడితో సినిమా చేయడానికి మహేశ్‌బాబు ఒప్పుకున్నాడట. ప్రస్తుతం ఈ వార్త ఇటు ఫిలింనగర్లోనూ, అటు సోషల్‌మీడియాలోనూ చక్కర్లు కొడుతున్నది. లాక్డౌన్ సమయంలో కూడా ఈ వార్త వినిపించింది. వెంకీ దర్శకత్వంలో మహేశ్ నటించబోతున్నడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తను అటు మహేశ్‌బాబు కానీ, ఇటు వెంకీ గానీ ధ్రువీకరించలేదు. అయితే ఇప్పడు మరోసారి ఇదే వార్త వినిపిస్తున్నది. వెంకీ చెప్పిన ఓ సబ్జెక్ట్ మహేశ్‌బాబుకు తెగ నచ్చేసిందట. అతడు వినిపించిన స్టోరీ లైన్ నచ్చడంతో ఫుల్ స్ట్రిప్ట్తో రమ్మని వెంకీకి చెప్పాడట. ఆ తర్వాత వెంకీ ఫుల్ ఫుల్ స్ట్రిప్ట్ సిద్ధం చేసుకుని వెళ్లి మహేశ్ కి వినిపించగా ప్రిన్స్ ఫిదా అయ్యాడట. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నది.
వెంకీ కుడుముల నితిన్ తో చేసిన భీష్మ సినిమా ఘనవిజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. మరోవైపు వెంకీ డైరెక్షన్‌కు కూడా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దీంతో మహేశ్ కూడా కథను విని ఓకే చెప్పినట్టు టాక్. ప్రస్తుతం మహేశ్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారి పాట మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే కొత్త మూవీకి ఒకే చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన సర్కారు వారి పాట మోషన్ పోస్టర్ మహేశ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నది. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
మైత్రీమూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ముందుగా వంశీ పైడిపల్లిని దర్శకుడిగా ప్రకటించారు. కానీ అనివార్య కారణాల వల్ల పరుశరామ్ కు చాన్స్ దక్కింది. పరుశరామ్ గత చిత్రం గీతా గోవిందం భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.