మహేష్‌ పని పూర్తయినట్టే!!

Update: 2015-07-27 15:33 GMT
    ప్రిన్స్‌ మహేష్‌ శ్రీమంతుడుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. జగపతిబాబు మహేష్‌ తండ్రి పాత్ర పోషించడం ప్రత్యేక ఆకర్షణ కానుంది. శ్రీమంతుడు పాటలు సూపర్‌ హిట్‌. కాబట్టి సినిమా కూడా అంతే భారీ విజయం సాధిస్తుందన్న ముందస్తు అంచనాలేర్పడ్డాయి.

    ఇప్పటికైతే మహేష్‌ తన పార్ట్‌ కి అనువాదం పూర్తి చేశాడు. ఇటు తెలుగు, అటు తమిళ్‌ రెండు చోట్లా అనువాదం పూర్తయింది. ఆగస్టు 7న తెలుగు, తమిళ్‌ రెండు చోట్లా అధికారికంగా రిలీజై పోతోంది. అలాగే హిందీలోనూ, మలయాళంలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఓవర్సీస్‌ లోనూ విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. శ్రీమంతుడు టీజర్‌, పాటలకు వచ్చిన రెస్పాన్స్‌ చూస్తే బిజినెస్‌ కూడా అదే రేంజులో జరుగుతోందని చెబుతున్నారు. ప్రిన్స్‌ మరోసారి జాక్‌ పాట్‌ కొట్టేట్టే కనిపిస్తున్నాడు. అసలే భారీ కాస్టింగ్‌ తో సినిమాలోని ప్రతి ఫ్రేమూ రంగుల మయంగా ఉంటుంది కాబట్టి కచ్ఛితంగా మ్యాజిక్‌ సాధ్యమే అనిపిస్తోంది. దూకుడును మించి శ్రీమంతుడు హిట్టు కొట్టాలని ఆకాంక్షిద్దాం.
Tags:    

Similar News