• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ పరువు అక్కడా...

మహేష్ పరువు అక్కడా పోగొడతారా?

By - Tupaki Desk
Update: 2018-08-04 08:05 GMT
తమిళ నాట మార్కెట్ పెంచుకుందామని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాడు మహేష్ బాబు. ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని డబ్ చేసి పెద్ద ఎత్తున రిలీజ్ చేయించాడు. ఈ చిత్రాన్ని స్వయంగా ప్రమోట్ చేశాడు కూడా. ఆ తర్వాత నేరుగా తమిళంలో ‘స్పైడర్’ సినిమా కూడా చేశాడు. ఆ సినిమా ఆడకపోయినా మహేష్ టాలెంట్ ఏంటో తమిళ జనాలకు తెలిసేలా చేసింది. ఈ ఊపులో ‘భరత్ అనే నేను’ సినిమాను తమిళనాట రిలీజ్ చేస్తే మంచి వసూళ్లు సాధించింది. మహేష్ కు తమిళనాట హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను కూడా చక్కగా ప్లాన్ చేసి తమిళంలో రిలీజ్ చేయాలని మహేష్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి టైంలో మహేష్ కు ఒక తలనొప్పి తప్పేలా లేదు. అతడి ప్రణాళికలకు గండికొట్టే సినిమా తమిళనాట రిలీజవుతోంది.

మహేష్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రాన్ని ఈ నెల 10న తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేయడానికి ముందే తమిళంలోనూ విడుదలకు ఒప్పందం కుదిరింది. అదేదో తెలుగు వెర్షన్‌ తో పాటుగా రిలీజ్ చేసేస్తే పోయేది. కానీ తెలుగులో ఈ చిత్రం ఘోర పరాజయం చవిచూశాక.. దాని తాలూకు చేదు జ్ఞాపకాల్ని మరిచిపోతున్న తరుణంలో ఇప్పుడు ఇంత ఆలస్యంగా దాన్ని రిలీజ్ చేయడమేంటో అర్థం కావడం లేదు. అది కూడా కమల్ హాసన్ సినిమా ‘విశ్వరూపం-2’ భారీ అంచనాలతో రిలీజవుతున్న రోజే తమిళంలో ఈ చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తున్నారు. ‘బ్రహ్మోత్సవం’ కేవలం డిజాస్టర్ కావడం కాదు.. మహేష్ పరువు తీసింది. ఈ సినిమా విషయంలో విపరీతంగా ట్రోల్స్ ఎదుర్కొన్నాడు మహేష్. ఇక్కడ పోయిన పరువు చాలదన్నట్లు తమిళంలోనూ దాన్ని రిలీజ్ చేసి అతడి ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ఉన్నారు. ఆడదని తెలిసి కూడా ఈ సినిమాను ఎందుకు రిలీజ్ చేస్తున్నారో మరి. తమిళ నాట కొంచెం కొంచెం ఫాలోయింగ్ పెంచుకుంటున్న మహేష్ కు ‘బ్రహ్మోత్సవం’ రిలీజ్ ఇబ్బందికరం అనడంలో సందేహం లేదు.
Tags:    
  • Mahesh Babu 
  • Brahmotsavam Movie 
  • Tamil 

Similar News

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

దర్శకుడిగా నవ్వించారు.. ఇప్పుడు నటుడిగా అలరించబోతున్నారు!

2026-11-03 09:33 GMT

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

Copyright @2026

Powered by Blink CMS