ట్రెండీ టాక్: పవన్- మహేష్ మల్టీస్టారర్?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ .. సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ తెరకెక్కే ఛాన్సుందా? అంటే ఇప్పట్లో అందుకు అవకాశం కనిపించడం లేదు. అయితే భవిష్యత్ లో ఇది సాధ్యం కాదు అని చెప్పలేం. ప్రస్తుతం పవన్ జనసేన కార్యకలాపాలతో పాటు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మహేష్ తనదారిలో తాను వరుసగా భారీ క్రేజీ చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు.
అయితే ఆ ఇద్దరినీ కలిపి సినిమా తీసేంత గొప్ప స్క్రిప్ట్ ఏదైనా ఎవరైనా ప్రముఖ దర్శకుడు రూపొందిస్తే అది పాజిబుల్ అయ్యే వీలుందేమో. ఒకవేళ అదే జరిగితే అది మెగా -ఘట్టమనేని అభిమానులకు కన్నులపండుగే అవుతుంది.
ఇక మహేష్ - పవన్ క్రేజీ కాంబో గురించిన ప్రస్థావన ఇప్పుడే ఎందుకు? అంటే ఇటీవల దిల్ రాజు 50వ బర్త్ డే వేడుకలో స్టార్లంతా ఒకే వేదికపైకి వచ్చి సెల్ఫీలతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫ్రేమ్ లో పవన్ - మహేష్ కలిసి ఉన్నది లేకపోవడం లోటుగా కనిపించింది. పవన్ .. మహేష్ ఎవరికి వారు వచ్చి వెళ్లారు. దీంతో ఆ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూడడం కుదరలేదు. ఇక ఆ ఇద్దరూ ఫోటోల కోసం వేచి చూసే సన్నివేశం కూడా ఉండదు.
అయితే పవన్ - మహేష్ మధ్య చక్కని స్నేహానుబంధం ఉంది గనుక ఆ ఇద్దరూ కలిసి పని చేస్తే బావుంటుందని అభిమానులు చాలా కాలంగా వేచి చూస్తున్నారు. పవన్ - వెంకటేష్ గోపాల గోపాల.. మహేష్ - వెంకటేష్ `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` తరహాలో ఇంకేదైనా మ్యాజిక్ సాధ్యమవుతుందేమోననే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. భవిష్యత్ లో సాధ్యం కాదని కూడా చెప్పలేం.