• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'మహర్షి' వెండి తెరపై...

'మహర్షి' వెండి తెరపై హిట్‌.. బుల్లి తెరపై ఫట్‌

By - Tupaki Desk
Update: 2019-10-18 05:54 GMT
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 25వ చిత్రంగా తెరకెక్కిన 'మహర్షి' చిత్రం మంచి వసూళ్లను నమోదు చేసింది. దాదాపుగా వంద కోట్లకు పైగా ఈ చిత్రం వసూళ్లు చేసిందని ట్రేడ్‌ వర్గాల టాక్‌. ఒకటి రెండు ఏరియాల్లో బ్రేక్‌ ఈవెన్‌ సాధ్యం కాకపోయినా ఓవరాల్‌ గా చూస్తే మహర్షి చిత్రం హిట్‌ అంటూ టాక్‌ వచ్చింది. వెండి తెరపైనే కాకుండా అమెజాన్‌ ప్రైమ్‌ లో కూడా మహర్షి చిత్రానికి మంచి స్పందన వచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌ వారు మహర్షి తో మంచి లాభాలు దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. కాని ఈ చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ తీసుకున్న జెమిని వారికి మాత్రం షాక్‌ తగిలింది.

బుల్లి తెరపై 'మహర్షి' చిత్రం తాజాగా వరల్డ్‌ టెలివిజన్‌ ప్రీమియర్‌ వేశారు. జెమిని టీవీ భారీగా ప్రమోట్‌ చేసి మరీ సినిమాను ప్రసారం చేసింది. కాని మహర్షి చిత్రం అర్బన్‌ మరియు రూరల్‌ కలిపి యావరేజ్‌ గా 8.4 టీఆర్పీ మాత్రమే వచ్చింది. 15 నుండి 20 మద్యలో టీఆర్పీ రేటింగ్‌ వస్తుందని ఆశించిన జెమిని వారికి 8.4 టీఆర్పీ రేటింగ్‌ మింగుడు పడటం లేదట. మహర్షి చిత్రంకు వచ్చిన బజ్‌ తో ఇతర ఛానెల్స్‌ తో పోటీ పడి భారీ మొత్తాన్ని కోట్‌ చేసి మరీ జెమిని టీవీ దక్కించుకుంది.

గతంలో డీజే 21.. జనతా గ్యారేజ్‌ 20.. రంగస్థలం 19.5 టీఆర్పీ రేటింగ్‌ ను దక్కించుకున్నాయి. చిన్న చిత్రాలైన ఫిదా 21.3 మరియు గీత గోవిందం 20.8 టీఆర్పీని సాధించాయి. అలాంటిది మహర్షి మరీ 10 లోపు టీఆర్పీ రేటింగ్‌ ను పొందడం ఆశ్చర్యంగా ఉంది. పెద్దగా పోటీ లేని సమయంలో మంచి రోజు చూసి మహర్షి చిత్రాన్ని జెమిని ప్రసారం చేసింది. అయినా కూడా ఎక్కువ టీఆర్పీ రేటింగ్‌ దక్కలేదు.

సినిమా విడుదలై చాలా కాలం అవ్వడంతో పాటు  అమెజాన్‌ లో వచ్చి చాలా రోజులు అయ్యింది. ఇప్పటికే చాలా మంది సినిమాను చూసేయడం వల్ల సినిమాపై జనాల్లో ఆసక్తి పోయింది. అందుకే ప్రేక్షకులు మహర్షిని బుల్లి తెరపై వచ్చినా పట్టించుకోలేదని కొందరు అంటున్నారు.
Tags:    
  • Maharshi 
  • Super Star 
  • Mahesh Babu 
  • Gemini Tv 
  • Satellite Rights 
  • Maharshi Flop 
  • Premier In Gemini Tv 
  • Average Rating 
  • Tupaki Updates 
  • Latest Tollywood Updates 

Similar News

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

Copyright @2026

Powered by Blink CMS