'మహాసముద్రం' షూటింగ్ షురూ చేస్తున్న టాలెంటెడ్ హీరో..!
'Rx 100' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అజయ్ భూపతి.. రెండేళ్ల గ్యాప్ తర్వాత చేస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ''మహాసముద్రం''. ఈ భారీ మల్టీస్టారర్ లో యువ హీరో శర్వానంద్ - 'బొమ్మరిల్లు' సిద్ధార్థ్ కలిసి నటిస్తున్నారు. ఇందులో అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటించనున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తాజా సమాచారం ప్రకారం 'మహా సముద్రం' షూటింగ్ ఈరోజు ప్రారంభం కానుంది. హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే 'శ్రీకారం' తోపాటు ఓ తెలుగు తమిళ ద్విభాషా చిత్రం షూటింగ్ పూర్తి చేసిన శర్వానంద్.. 'మహాసముద్రం' చిత్రీకరణలో పాల్గొననున్నాడు. ఇక సిద్ధార్థ్ ఎనిమిదేళ్ల తర్వాత తెలుగు సినిమాలో నటించనున్నాడు. కాగా, ఇటీవల విడుదలైన 'మహా సముద్రం' థీమ్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకుంది. ఒక వైపు ప్రేమను మరొక వైపు యుద్ధాన్ని ప్రతిబింబించేలా ఈ కాన్సెప్ట్ పోస్టర్ ఉంది. ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ సంగీతం అందించనున్నారు. రాజ్ తోటా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ వర్క్ చేయనున్నారు. శరవేగంగా షూటింగ్ చేసి ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.