• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'మహా సముద్రం' రిలీజ్...

'మహా సముద్రం' రిలీజ్ ట్రైలర్: లవ్ అండ్ యాక్షన్ కలబోసిన ఎమోషనల్ డ్రామా..!

By - Tupaki Desk
Update: 2021-10-09 16:50 GMT
'Rx 100' వంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న సినిమా ''మహా సముద్రం''. వర్సటైల్ యాక్టర్స్ శర్వానంద్ - సిద్దార్థ్ కలసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో అదితిరావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించగా.. జగపతి బాబు - రావు రమేష్ - కేజీయఫ్ గరుడ రామ్ - శరణ్య ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇన్టెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ నేపథ్యంలో 'మహా సముద్రం' మేకర్స్ శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ - ట్రైలర్ - పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈరోజు శనివారం గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మరో ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'భుజాల మీదున్న బరువుని బలమున్న వాడు ఎవడైనా మోస్తాడు.. కానీ మనసులో ఉన్న బాధను బంధాల విలువ తెలిసిన వాడు ఒక్కడే మోయగలడు.. ఆ బంధం ప్రేమైనా స్నేహమైనా..' అని శర్వానంద్ చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది.

ఇందులో లవ్ అండ్ యాక్టన్ తో పాటుగా అజయ్ భూపతి శైలి ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నాయని 'మహా సముద్రం' రిలీజ్ ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. అయితే ఇందులో కూడా కథ ఎంటనేది ప్రేక్షకుడు గెస్ చేయకుండా ట్రైలర్ ని కట్ చేయడం విశేషం. శర్వా - సిద్దార్థ్ లను స్నేహితులుగా చూపించి.. కొన్ని పరిస్థితుల వల్ల ఒకరినొకరు చంపుకోవాలనుకునే బద్ధ శత్రువులుగా మారినట్లు చూపించారు. అదే సమయంలో ఎవరు ఎవరిని లవ్ చేస్తున్నారో అర్థం కాకుండా జాగ్రత్త పడ్డారు.

ఒక సీన్ లో శర్వానంద్ - అదితి హత్తుకొని కనిపిస్తుండగా.. మరో సన్నివేశంలో సిద్దార్థ్ - అదితి రొమాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. అలానే శర్వా - అను ఇమ్మాన్యుయేల్ మధ్య లవ్ ట్రాక్ ని కూడా హైలైట్ చేశారు. మొత్తం మీద ఇందులో 'మహా' పాత్రలో నటిస్తున్న అదితిరావు హైదరి పాత్ర చుట్టూ ఈ కథ నడుస్తుందని హింట్ ఇచ్చారు. అంతేకాదు రెండు కాలల్లో జరుగుతుందని వెల్లడించారు. హీరోహీరోయిన్లతో పాటుగా జగపతి బాబు - రావు రమేష్ - గరుడ రామ్ క్యారెక్టర్స్ కూడా ఇందులో శక్తివంతమైనవిగా తెలుస్తోంది. ఇందులో యాక్షన్ పాళ్ళు కాస్త ఎక్కువగా ఉన్నాయి.

'కండ బలం ఉన్నోడి కన్నా.. బుద్ధి బలం ఉన్నోడు గొప్పోడు' 'చెంప మీద కొడితే మరో చెంప చూపించడానికి నేనేమన్నా గాంధీ ఫాలోవర్ ని అనుకున్నావా.. భగత్ సింగ్ ఫాలోవర్ ని' 'యముడి పెట్టిన ముహూరం కన్నా.. ఒక్క నిమిషం ముందే చంపేస్తాను' వంటి పవర్ ఫుల్ డైలాగ్స్ ఆలోచింపజేస్తున్నాయి. దీనికి చేతన్ భరద్వాజ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. రాజ్ తోట కెమెరా పనితనం ట్రైలర్ లో కనిపిస్తోంది. మొత్తం మీద ఈ 'మహాసముద్రం' ట్రైలర్ ఎమోషనల్ అండ్ గ్రిప్పింగ్ గా ఆసక్తికరంగా ఉంది.

ఆల్రెడీ థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుండగా.. ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ అంటూ మరొకటి వదిలి 'మహా సముద్రం' మేకర్స్ సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీకి నాంది పలికారు. ఈ రెండూ కూడా సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. కొల్లా అవినాష్ దీనికి ప్రొడక్షన్ డిజైనర్ గా.. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్ గా వర్క్ చేశారు. మరో ఐదు రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలన విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.

Full View






Tags:    
  • Maha Samudram 
  • Maha Samudram release date 
  • Maha Samudram new trailer 
  • Sharwanand 
  • Siddharth 
  • Aditi Rao 
  • Ajay Bhupathi 

Similar News

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్

2026-11-09 11:09 GMT

వెట్టువమ్ 'సెలబ్రేట్ రెసిలియెన్స్'.. ఇంటెన్స్ లుక్‌లో శోభిత

2026-11-09 11:03 GMT

మాజీ ముఖ్య‌మంత్రితో సూప‌ర్ స్టార్ రాజ‌కీయం ఏంటో?

2026-11-09 10:43 GMT

ఈవారం ఓటీటీ రిలీజ్ చిత్రాలు, సిరీస్ లు ఇవే!

2026-11-09 10:42 GMT

అనుమ‌తి లేకుండా బయోపిక్‌లు తీయ‌డం ఎంత రిస్క్ అంటే?

2026-11-09 10:40 GMT

గాడ్ ఆఫ్ వార్ పై ఊహించ‌ని సందేహాలు!

2026-11-09 10:30 GMT

చిన్న సినిమాలను ఆదరించేది ఎప్పుడు?

2026-11-09 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS