#సలార్.. ఆడిషన్స్ వంకతో ప్రభాస్ ని చూసేందుకా?
భారీ సినిమాలకు ఆడిషన్స్ అంటూ హడావుడి చేయాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ కొన్నిసార్లు అలా హడావుడి చేస్తున్నారు అంటే రకరకాల సందేహాలకు తావిచ్చినట్టే. ఇదిగో ఇప్పుడు కేజీఎఫ్ డైరెక్టర్ `సలార్` ఆడిషన్స్...! విషయంలోనూ అలాంటి సందేహమే వ్యక్తం చేస్తున్నారు.
అయినా ఇదంతా బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్టులు కోసమే కదా...! జనాలు కావాలి కాబట్టి ఆడిషన్స్ అంతేనా...! ఇంపార్టెంట్ క్యారెక్టర్లు ఆల్రేడీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి కదా...! అయితే అంతమంది ఎందుకొస్తున్నారు? అంటే... దాని వెనక లాజిక్ ఉంది మరి. ఏదో ప్రభాస్ ని స్వయంగా చూడాలనే తపనతోనే ఈ ఆడిషన్స్ కి వచ్చాము అని చాలా మంది అంటున్నారట. ఏదైమైనా ఈ పబ్లిసిటి స్టంట్ మాత్రం బాగా వర్క్ అవుట్ అయింది. అయితే ప్రభాస్ సినిమాలకు ఇలాంటి పబ్లిసిటి స్టంట్స్ అవసరం లేదని సలార్ టీమ్ కి తెలియనిదా?
ఇంత హడావుడి చేయకపోతే బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఏ మూవీలో నటిస్తున్నారు? అన్నది కన్ఫ్యూజన్ గా ఉంటుంది కదా? ఓవైపు ఓంరౌత్ `ఆదిపురుష్ 3డి`కి బోలెడంత హంగామా కనిపిస్తోంది. మరోవైపు నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీ విషయంలోనూ ప్రచారం తక్కువేమీ లేదు. ఆ రెండిటికీ ఏమాత్రం తగ్గకుండా ప్రశాంత్ నీల్ బృందం ఇలా హడావుడి చేస్తున్నారా? అయినా ఇప్పటి నుంచీ లైమ్ లైట్ లో ఉంటేనే తమ ప్రాజెక్ట్ కి పాన్ ఇండియా కేటగిరీలో అందరి మైండ్ లో రిజిస్టర్ అవుతుందని భావిస్తున్నారేమో! ఒకేసారి నాలుగు సినిమాలతో ప్రభాస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నప్పుడు తమ సినిమా రిజిస్టర్ అవ్వాలనుకోవడం తప్పేమీ కాదేమో!