'లైగర్' సర్ప్రైజ్.. న్యూ ఇయర్ స్పెషల్ గా VD స్టిల్స్..!

Update: 2021-12-30 05:33 GMT
యంగ్ హీరో విజయ్ దేవరకొండ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌ లో రూపొందుతోన్న పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ''లైగర్''. 'సాలా క్రాస్ బ్రీడ్' అనే ట్యాగ్ లైన్ తో వస్తోన్న ఈ చిత్రంలో విజయ్ బాక్సర్‌ గా కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌ గా నటిస్తుండగా.. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఈ సినిమాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌ కు పరిచయం కాబోతోన్నారు.

ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ''లైగర్'' చిత్రం నుంచి న్యూ ఇయర్ స్పెషల్‌ గా వరుస సర్ప్రైజ్ లు ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. అందులో భాగంగా 'ఆగ్ లగా దేంగే' అంటూ లైగర్ ఫస్ట్ గ్లింప్స్‌ ను విడుదల చేయబోతోన్నారు. ఇప్పటికే బిగ్ అనౌన్స్ మెంట్ వీడియోతో గ్లిమ్స్ మీద ఆసక్తిని కలిగించారు. ఈ క్రమంలో తాజాగా స్పెషల్ వర్కింగ్ స్టిల్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

'ఫోకస్ అండ్ ఎటాక్' అంటూ వదిలిన ఈ ఫొటోలో విజయ్ దేవరకొండ కెమెరా వెనుక దృష్టి కేంద్రీకరించి ఉన్నారు. అలానే మరో స్టిల్ లో పూరీ జగన్నాథ్ సీన్ ని వివరిస్తుండగా.. వీడీ ఫుల్ ఫోకస్ పెట్టి వింటుండటం కనిపిస్తోంది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీని అందించడానికి దర్శక హీరోలిద్దరూ తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది.

ఇకపోతే 'లైగర్' స్పెషల్ ఇన్ స్టా ఫిల్టర్‌ ను ఈరోజు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయబోతోన్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అలానే డిసెంబర్ 31న ఉదయం 10:03 గంటలకు ఫస్ట్ గ్లిమ్స్ ద్వారా బీస్ట్ ని ఈ నేషన్ కు ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు ఇది వరకే తెలిపారు.

కాగా, 'లైగర్' సినిమా పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ లకు ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఇద్దరి కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ ఇదే. పూరి కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పూరి జగన్నాధ్ - ఛార్మి కౌర్ - కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా కలసి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఇందులో రమ్యకృష్ణ - రోనిత్ రాయ్ - విష్ణు రెడ్డి - అలీ - మకరంద్ దేశ్ పాండే - గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. కెచా స్టంట్ డైరెక్టర్ గా.. జానీ షేక్ బాషా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

'లైగర్' చిత్రాన్ని 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు.


Tags:    

Similar News