రాజా బాలులు మళ్ళీ కలిశారు

Update: 2019-05-27 11:25 GMT
కొన్నేళ్ల క్రితం కాపీ రైట్స్ వివాదంలో మనస్పర్థలు వచ్చిన కారణంగా ఒకరితో ఒకరు మాటల్లేక దూరమైన సంగీత దిగ్గజం ఇళయరాజా గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎట్టకేలకు ఒక్కటయ్యారు. తన అనుమతి లేకుండా పాటలు పాడి ఆదాయం సంపాదించుకుంటూ రాయల్టీ చెల్లించడం లేదని రాజా ఎప్పుడైతే బాలుకు లీగల్ నోటీసు పంపారో అప్పటి నుంచి ఈ అగ్గి రాజుకుంది.

ఆ క్షణం నుంచే బాలు పబ్లిక్ స్టేజి మీద రాజా కంపోజ్ చేసిన పాటలు పాడటం మానేశారు. మరోవైపు బాలు లేకుండానే ఇళయరాజా చేసిన లైవ్ కన్సర్ట్స్ సక్సెస్ అయినా ఆశించిన స్పందన తెచ్చుకోలేకపోయాయి. ఇదంతా చూస్తూ బాధ పడని సంగీత ప్రేమికులు లేరు. వాళ్లకు ఊరట కలిగించేలా ఇద్దరి కలయిక ఇకపై సాధ్యం కాబోతోంది

వచ్చే నెల 2న చెన్నైలో ఈవిపి ఫిలిం సిటీలో భారీ ఎత్తున లైవ్ కన్సర్ట్ ఒకటి జరగబోతోంది. ఇసై సెలబ్రేట్స్ ఇసై పేరుతో బాలు-రాజా-ఏసుదాసు సంయుక్తంగా పాల్గొనబోయే ఈ విభావరి మరోసారి అపూర్వ సంగమానికి తెర తీయనుంది. ఇవాళ ప్రసాద్ స్టూడియోస్ లో బాలు రాజాలు ప్రాక్టీస్ చేస్తుండగా క్లిక్ మనిపించినటోలు చూసుకున్న మ్యూజిక్ లవర్స్ ఆనందం గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఒకరినొకరు వాడు వీడు అని పిలుచుకునేంత స్నేహం ఉన్న రాజా బాలులు ఇలా విడిపోవడం అప్పట్లో దుమారం రేపింది. ఈ ఏడాది ప్రారంభంలో కోయంబతూర్ లో బాలు చాలా కాలం తర్వాత ఇళయరాజా పాటలు పాడి త్వరలో కలవబోతున్నామన్న సంకేతం ఇచ్చారు. అది ఇప్పటికి నెరవేరింది. దీని కోసం బుకింగ్స్ కూడా భారీ ఎత్తున జరగనున్నాయి. మీరూ ఈ ఇద్దరి వీరాభిమానులు అయితే మిస్ కాకుడని సంగమమిది


Tags:    

Similar News