• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇగ్లూ ముందు చెర్రీ పోజు.....

ఇగ్లూ ముందు చెర్రీ పోజు.. ఫిన్లాండ్ లో మెగా కపుల్ ఫన్నీ మూమెంట్స్..!

By - Tupaki Desk
Update: 2022-03-17 07:01 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. గత మూడేళ్ళుగా 'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికే పరిమితం అవ్వడంతో.. తన సతీమణి ఉపాసన తో కలిసి ఎలాంటి వెకేషన్స్ కు వెళ్లలేకపోయారు. అప్పుడెప్పుడో 'వినయ విధేయ రామ' టైమ్ లో జార్జియాకు వెళ్లొచ్చిన మెగా కపుల్.. రీసెంట్ గా వెకేషన్ కు వెళ్లారు.

రాంచరణ్ - ఉపాసన కొణిదెల జంట తమ స్నేహితులతో కలిసి గత కొన్ని రోజుల పాటు ఫిన్ లాండ్ లో వెళ్ళి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటి కప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉన్నారు. ఈ వెకేషన్ లో భార్యాభర్తల ఫన్ మూమెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా రామ్ చరణ్ మరికొన్ని ఫొటోలను.. ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇందులో మెగా దంపతులు మరో కపుల్ తో కలిసి మంచులో చలి మంట కాచుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. మరో ఫొటోలో మంచు ప్రదేశాల్లో నిర్మించుకునే ఇగ్లూ గృహం ముందు చెర్రీ  ఫోజ్ ఇచ్చారు. ఈ స్టైలిష్ పిక్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటోంది

ఇక వీడియోలో చరణ్ మంచులో చిన్నపాటి గుంతతవ్వి నీటిని తాగుతూ కనిపిస్తున్నారు. ఆ వాటర్ చాలా బాగుందని ఉందని సూచిస్తున్నారు. మంచు పర్వతాల నుండి చెర్రీ - ఉపాసనల చిత్రాలు మరియు వీడియోలు ఖచ్చితంగా వెకేషన్ కు వెళ్ళడానికి మనల్ని ఉత్సాహపరుస్తాయి.

మంచు పర్వతాలను మిస్ అవుతున్నామని రామ్ చరణ్ ఇన్స్టాగ్రామ్ లో పేర్కొన్నారు. అంతకుముందు పోస్టులో రెస్ట్ తీసుకొని RRR ప్రమోషన్స్ కు రెడీ అవుతున్నానని కామెంట్ పెట్టారు. మొత్తం మీద దాదాపు మూడేళ్ళ తర్వాత భార్యాభర్తలు హోలిడేకి వెళ్లి సరదా సమయాన్ని గడిపారని అర్థం అవుతోంది.

ఇక సినిమాల విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ నటించిన 'ఆర్ ఆర్ ఆర్' చిత్రం ఈ నెల 25న విడుదల కాబోతోంది. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపించనున్నారు. ఇక స్టార్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్న Rc15 మూవీ షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల రానుంది.

మరోవైపు తన తండ్రి చిరంజీవితో కలిసి రామ్ చరణ్ నటించిన 'ఆచార్య' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

ఇక త్వరలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చెర్రీ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. మెగా వారసుడి పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న దీనికి సంబంధించిన ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

Full View
Tags:    
  • megastar ramcharan 
  • upasana 
  • finlaand 
  • vacation 

Similar News

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

Copyright @2026

Powered by Blink CMS