• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'థాంక్యూ' తర్వాత కథ...

'థాంక్యూ' తర్వాత కథ మొదలు..!

By - Tupaki Desk
Update: 2022-07-20 01:30 GMT
హీరోయిన్ గా ఊహలు గుసగుసలాడే సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. ఈ అమ్మడు అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందో అందరం చూస్తూనే ఉన్నాం. ఇండస్ట్రీలో కొన్నాళ్ల పాటు కొనసాగేందుకు ఆమె పడ్డ కష్టం.. పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. బాడీ షేమింగ్ చేయడంతో సన్నగా నాజూకుగా తయారు అయ్యింది.

డాన్స్ ల విషయంలో విమర్శలు రావడంతో కఠినంగా ప్రాక్టీస్ చేసింది. ఇతర విషయాల పట్ల కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంది.. కథల ఎంపిక విషయం మొదలుకుని స్కిన్ షో వరకు జనాలు ఏదైతే కోరుకున్నారో.. కోరుకుంటున్నారో అదే ఇవ్వాలి.. చేయాలని భావించింది. అయినా కూడా రాశి ఖన్నా కు అదృష్టం కలిసి రాలేదు.

సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత పీక్స్ లో ఉంటుంది. అయినా కూడా సినిమాల్లో ఈమెకు వస్తున్న ఆఫర్లు తక్కువే. ఇటీవల ఈమె చేసిన సినిమా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడింది. ఇక త్వరలో థాంక్యూ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా లో నాగ చైతన్య తో ముగ్గురు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్‌ గా.. కాస్త మెయిన్‌ లీడ్ గా కనిపించబోతుంది.

థాంక్యూ సినిమా సక్సెస్ అయితే రాశి ఖన్నా కు పెద్దగా కష్టపడకుండానే ఆఫర్లు అయితే వస్తాయి. ఒకటి రెండు సినిమా ల్లో వెంటనే అవకాశం రావడం జరుగుతుంది. కానీ ఫలితం తేడా కొడితేనే అసలు కథ మొదలవుతుంది. ఆఫర్ల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాలి. తమిళంలో అడపా దడపా వస్తున్నప్పటికి తెలుగు లో ఆఫర్లు రాబట్టుకునేందుకు సోషల్‌ మీడియా లో హడావుడి చేస్తూ ఉండాలి.

ప్రస్తుత గ్లామర్ డోస్ ను పెంచాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఇండస్ట్రీ లో రెగ్యులర్ గా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీడియా లో ఉండాలి. అప్పుడే సినిమాల్లో ఆఫర్లు వస్తాయి. అక్కడి వరకు రాశి ఖన్నా పరిస్థితి వెళ్లక పోవచ్చు అనేది కొందరి అభిప్రాయం. హీరోయిన్ గా థాంక్యూ సినిమా తో రాశి కి పూర్వ వైభవం.. మంచి ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

దర్శకుడు విక్రమ్‌ కే కుమార్‌ తన సినిమా ల్లో హీరోయిన్ పాత్రలకు చాలా  ప్రాముఖ్యతను కల్పిస్తాడు. కనుక ఈ సినిమా తర్వాత రాశి కి ఫలితం తో సంబంధం లేకుండా ఆఫర్లు వస్తాయి అనే వారు కూడా లేకపోలేదు. మరి రాశి కెరీర్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంటుంది అనేది త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Tags:    
  • Tollywood 
  • Actress 
  • RaashiKhanna 
  • Uhalu Gusagusalagey 
  • Pakka Commerical 
  • Thankyou 
  • Dates 
  • New Movies 
  • Movienews 

Similar News

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS