పోటో టాక్‌: చిరుత‌న‌యుడు వ్వావ్!

Update: 2020-02-04 05:47 GMT
చిరుత‌నయుడి ఫోజు చూశాక వ్వావ్ అనకుండా ఉండ‌లేరు. అల్ట్రా మోడ్ర‌న్ స్టైల్లో క‌నిపించాలంటే చ‌ర‌ణ్ త‌ర్వాత‌నే. మెగాస్టార్ చిరంజీవి న‌ట‌వార‌సుడిగా బాస్ లోని గ్రేసు స్పీడు చెర్రీ బాడీలో ఇంకిపోయింది. అది ప్ర‌తి సంద‌ర్భంలోనూ క‌నిపిస్తూనే ఉంటుంది. మాట్లాడే మాట తీరు.. చూసే చూపు.. బాడీ లాంగ్వేజ్.. ఇక ప‌దిమందితో ఒదిగి ఉండే స్వ‌భావం .. ప‌రిణ‌తి చెందిన యాటిట్యూడ్ తో ప్ర‌తిసారీ చ‌ర‌ణ్ స‌ర్ ప్రైజ్ ఇస్తూనే ఉన్నారు.

ఇక అందం అనేది కేవ‌లం పైకి క‌నిపించే మెటీరియ‌ల్ కాదు. అది వంద‌శాతం మాన‌సిక ప‌రివ‌ర్త‌న! అని పెద్ద‌లు చెప్పిన‌ట్టే.. చ‌ర‌ణ్ ఆ క్వాలిటీస్ తో అంద‌రికీ సుప‌రిచితుడ‌య్యారు. ముఖ్యంగా మీడియా మీట్ల‌లో పాత్రికేయుల‌తో అత‌డు చ‌నువుగా క‌లిసిపోయే తీరు.. డౌన్ టు ఎర్త్ ఉండే తీరు అంద‌రికీ న‌చ్చుతుంది. వీట‌న్నిటినీ మించి అభిమానుల విష‌యంలో చ‌ర‌ణ్ నిజాయితీ మైమ‌రిపిస్తుంది. అందుకేనేమో బ‌హుశా.. అత‌డికి స్టార్ ని మించిన ఫాలోయింగ్ సాధ్య‌మైంది. చేసే ప‌నిపై వంద‌శాతం శ్ర‌ద్ధ పెట్ట‌డం.. అంకిత‌మై ప‌ని చేయ‌డం.. అలాగే ఒదిగి ఉండ‌డం అన్న‌ది చిరంజీవి `పునాది రాళ్లు` స‌మ‌యం నుంచే ఉంద‌ని ఆయ‌న‌ను సన్నిహితంగా చూసిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు చెబుతుంటారు. ఇప్పుడు దానినే చ‌ర‌ణ్ అనుస‌రిస్తున్నారు.

చిరు త‌న‌యుడు వ్వావ్! అన‌డానికి కార‌ణం .. కేవ‌లం అత‌డి స్టైల్ గ్రేసు మాత్ర‌మే కాదు. అత‌డి యాటిట్యూడ్ కూడా ఓ కార‌ణం. చిరు వార‌సుడిగా ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించినా చాలా త‌క్కువ కాలంలోనే త‌న‌దైన స్టైల్ తో దూసుకుపోయాడు. హార్డ్ వ‌ర్క్ తో స్టార్ డ‌మ్ ని అందిపుచ్చుకున్నాడు. అందుకే చ‌ర‌ణ్ అన‌గానే అభిమానులు వ్వావ్ అంటారు. ఇంత‌కీ ఇక్క‌డ RAAM అమ్ స్ట‌ర్ డామ్ అనే కాఫీ బార్ ముందు ఇలా చ‌ర‌ణ్ ఫోజులిచ్చారేమిటి? ఆ కాఫీ షాప్ కి రామ్ చ‌ర‌ణ్ కి ఏమిటి సంబంధం? అంటే దానికి త‌నే స్వ‌యంగా స‌మాధానం ఇవ్వాల్సి ఉంటుంది. బ్లూ డెనిమ్స్ .. ఎల్లో నెక్.. దానిపై లెద‌ర్ జ‌ర్కిన్ తో చ‌ర‌ణ్ అల్ట్రా స్టైలిష్ గా క‌నిపిస్తున్న ఈ ఫోటోలు ప్ర‌స్తుతం యువ‌త‌రం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది. మెగా అభిమానులు ఈ లుక్ ని వైర‌ల్ గా ప్ర‌మోట్ చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. చ‌ర‌ణ్ న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఆర్.ఆర్.ఆర్ త్వ‌ర‌లో రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News