• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫస్ట్ లుక్: బంగార్రాజు...

ఫస్ట్ లుక్: బంగార్రాజు ఇంట్లోకి నాగలక్ష్మి గా అడుగుపెట్టిన యంగ్ బ్యూటీ..!

By - Tupaki Desk
Update: 2021-11-18 05:36 GMT
కింగ్ అక్కినేని నాగార్జున - యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య కలిసి నటిస్తున్న తాజా చిత్రం ''బంగార్రాజు''. 'సోగ్గాడు మళ్ళీ వచ్చాడు' అనేది దీనికి ఉపశీర్షిక. కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ కు సీక్వెల్. ఐదేళ్ల క్రితం బంగార్రాజుగా సందడి చేసిన నాగ్.. ఈసారి తనయుడు చైతూ తో కలిసి సినీ ప్రియుల్ని అలరించడానికి వస్తున్నారు. ఇందులో సీనియర్ నటి రమ్యకృష్ణ తో పాటుగా యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న కృతి శెట్టి 'బంగార్రాజు' చిత్రంలో నాగచైతన్య కు జోడీగా కనిపించనుంది. ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని చిత్ర బృందం ఈరోజు గురువారం విడుదల చేసింది. ఇందులో నాగలక్ష్మి అనే పాత్రను కృతి పోషిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో లంగావోణీలో చేతిలో కళ్ళద్దాలు పట్టుకొని కృతి బ్యూటిఫుల్ గా ఉంది. గ్రామ ప్రజలు మెడలో పూలమాల వేసి ఊరేగిస్తుండగా.. అందరికీ అభివాదం చేస్తూ కనిపిస్తోంది. మరి కృతి ఏమి సాధిస్తే జనాలు ఇలా ఆమెను మోస్తున్నారో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

కాగా, 'బంగార్రాజు' చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన నాగార్జున - రమ్యకృష్ణ పోస్టర్ మరియు 'లడ్డుండా' సాంగ్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో నాగలక్ష్మి గా వచ్చిన కృతి శెట్టి ఆకట్టుకుంటోంది. బంగార్రాజు కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రాబోతున్నట్లు చైతన్య తెలిపారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలిపే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారేమో చూడాలి.
Tags:    
  • Kriti shetty 
  • Kriti shetty first look 
  • Bangarraju 
  • Bangarraju movie 
  • Naga chaitanya 
  • Nagarjuna Bangarraju 
  • Bangarraju Shooting 
  • Bangarraju release date 

Similar News

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS