• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇక్కడ నాని.. అక్కడ సిద్ధు

ఇక్కడ నాని.. అక్కడ సిద్ధు

By - Tupaki Desk
Update: 2016-02-13 11:30 GMT
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా టాలెంటుతో పైకి వచ్చిన ఇద్దరు హీరోలు ఒకే రోజు రెండు వేర్వేరు భాషల్లో మంచి విజయాలందుకున్నారు. ఈ శుక్రవారం తెలుగులో ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’తో నాని మాంచి హిట్టు కొడితే.. అటు తమిళంలో ‘జిల్ జంగ్ జక్’తో సిద్దార్థ్ సూపర్ సక్సెస్ అందుకున్నాడు. 2014లో నాని ఎలాంటి స్థితిలో ఉన్నాడో అందరికీ తెలిసిందే. తరుణ్ - ఉదయ్ కిరణ్ లాంటి హీరోల తరహాలో నాని కూడా తెరమరుగైపోతాడా అన్న అనుమానాలు కూడా కలిగాయి. కానీ ‘ఎవడో సుబ్రమణ్యం’తో మళ్లీ తన ఉనికిని చాటుకున్న నాని.. ‘భలే భలే మగాడివోయ్’తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి తన స్థాయిని అమాంతం పెంచుకున్నాడు. ఇప్పుడిక ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ అతణ్ని మరో మెట్టు ఎక్కించింది. ‘భలే భలే..’కు దీటుగా ఈ సినిమా కూడా కలెక్షన్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక సిద్ధు విషయానికి వస్తే.. తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పేశాక తన టేస్టుకు తగ్గట్లు వైవిధ్యమైన సినిమాలతో ప్రయాణం సాగిస్తున్నాడీ టాలెంటెడ్ హీరో. లవ్ ఫెయిల్యూర్ తర్వాత మరోసారి తన సొంత నిర్మాణ సంస్థలో ‘జిల్ జంగ్ జక్’ అనే వెరైటీ సినిమా తీసి ప్రేక్షకుల్ని మెప్పించాడు సిద్ధు. టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి క్రియేటివిటీతో కుమ్మేస్తున్న సిద్ధు టీం.. తెర మీద కూడా అదే క్రియేటివిటీ చూపించింది. తమిళంలో ఈ టైపు సినిమా ఇంతవరకు రాలేదని.. బోల్డ్ అటెంప్ట్ అని.. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు కచ్చితంగా చూడాల్సిన సినిమా అని ‘జిల్ జంగ్ జక్’ మీద ప్రశంసలు కురుస్తున్నాయి. కొంత నెగెటివ్ టాక్ కూడా ఉన్నప్పటికీ అది అంతగా పట్టించుకోదగ్గది కాదు. మొత్తానికి ఇద్దరు టాలెంటెడ్ హీరోలు ఒకే రోజు మంచి విజయాలందుకోవడం మంచి విషయమే.
Tags:    
  • Krishna Gaadi Veera Prema Gaadha 
  • Jil Jung Juk Movie 
  • Telugu NEws 

Similar News

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS