క్రిష్‌ కి కూడా ఈ పిచ్చి బాగా ఉన్నట్లుందిగా..!

Update: 2018-12-08 13:27 GMT
లక్షలు, కోట్లు పెట్టి కార్లు కొనుగోలు చేసిన వారు తమ కారుకు ఫ్యాన్సీ నెంబర్‌ కావాలని భారీ గా ఖర్చు పెట్టడం చాలా కామన్. తన కారుకు అన్ని కూడా 9 నెంబర్‌ లు ఉండాలని కోరుకునే నటుడు ఎన్టీఆర్‌. ఇంకా పలువురు కూడా స్టార్స్‌ తమ కార్లకు ఫ్యాన్సీ నెంబర్‌ లను తీసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. సెలబ్రెటీలు కారు నెంబర్లు వారి స్టేటస్‌ సింబల్‌ గా భావిస్తారు. చాలా సింపుల్‌ గా కనిపించే క్రిష్‌ కు కూడా ఈ స్టేటస్‌ బాగా వంటబట్టినట్లుగా ఉంది. తాజాగా తాను కొన్న కారు కోసం ఏకంగా 9 లక్షలు పెట్టి నెంబర్‌ తీసుకున్నాడు.

ఖైరతాబాద్‌ ఆర్‌ టీ ఏ ఆఫీస్‌ లో తన కొత్త ఎస్‌ యూ వి కారుకు గాను అన్ని 9 నెంబర్‌ లు కలిగిన ప్యాన్సీ నెంబర్‌ ను కొనుగోలు చేశాడు. ఇక్క విచిత్రం ఏంటీ అంటే  TS 09 FC 9999 నెంబర్‌ కు క్రిష్‌ 9 లక్షలు ఖర్చు చేశాడు. ఖర్చు విషయంలో కూడా సెంటిమెంట్‌ ను కనబర్చి 9 లక్షలు పెట్టి కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి క్రిష్‌ తన 1.37 కోట్ల కారుకు 9 లక్షలు ఖర్చు పెట్టి నెంబర్‌ తీసుకోవడం టాలీవుడ్‌ లో హాట్‌ టాపిక్‌ అయ్యింది.

వరుసగా విజయాలు దక్కించుకుంటూ స్టార్‌ డైరెక్టర్‌ క్రేజ్‌ ను దక్కించుకున్న క్రిష్‌ ఏమాత్రం తగ్గకుండా తన స్టార్‌ డంను చూపించేందుకు ఇలా ఖరీదైన కారు, అంతే ఖరీదైన నెంబర్‌ ను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్‌’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. వచ్చే నెలలో ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Tags:    

Similar News