• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రామ్ చరణ్ నాకు దొరికిన...

రామ్ చరణ్ నాకు దొరికిన ప్రసాదం: కొరటాల

By - Tupaki Desk
Update: 2021-12-02 08:37 GMT
టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరుగా కనిపిస్తారు. ఒక దానికి మించి మరొక హిట్ ను అందిస్తూ, అపజయమెరుగని దర్శకుడిగా ఆయన దూసుకుపోతున్నారు. ఆయన తాజా చిత్రమైన 'ఆచార్య' విడుదలకు సిద్ధమవుతోంది. చిరంజీవి - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఫిబ్రవరి 4వ తేదీన భారీస్థాయిలో థియేటర్లకు రానుంది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన ప్రచార చిత్రాలు ..  పాటలు అంతకంతకూ అంచనాలు పెంచుతూ వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి తాజా ఇంటర్వ్యూలో కొరటాల శివ మాట్లాడారు.

"ప్రతి ఒక్కరి జీవితంలో ఒక 'ఆచార్య' ఉంటాడు. మన పెద్దలు .. మన పురాణాలు ఆచార్యుడిని నమ్మి .. ఆయనపై పూర్తి భారం వేయమనే చెప్పాయి. ఆచార్య మనలను రక్షిస్తాడు .. మన బతుకులను బాగు చేస్తాడు అనే నమ్మకంతోనే పూర్వం గురుకులాలలో చేరేవారు. అలా రక్షించడం కోసం ఉన్నవాడిగానే ఈ సినిమాలో ఆచార్య కనిపిస్తాడు. 'పాఠాలు చెప్పే ఆచార్యను కాను .. గుణపాఠాలు చెప్పే ఆచార్యను' అనే డైలాగ్ చిరంజీవి నోటి నుంచి రావడం వలన అంతగా పేలింది .. అంతగా పండింది. తెరపై నేను చిరంజీవిగారినికి ఎలా చూడాలని అనుకున్నానో .. అలా చూపించడానికి ప్రయత్నించాను.

ముందుగా నేను ఒక కథను అనుకుంటాను. ఆ తరువాత ఫలానా పాత్రకి ఫలానా వారైతే బాగుంటుందని భావించి, ఆ దిశగా ముందుకువెళతాను. ఆర్టిస్టుల క్రేజ్ ను బట్టి కథను పక్కకి తీసుకెళ్లకుండా .. కమర్షియల్ హంగుల కోసం కథను ఎక్కువగా పొల్యూట్ చేయకుండా చూసుకుంటాను. కథ ఆత్మ దెబ్బతినకుండా .. ఆరిస్టుల స్టార్ డమ్ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటాను. అలాగే అభిమానుల అంచనాలకి తగ్గకుండా దృష్టి పెడుతుంటాను. అన్ని హంగులు దిద్దుతాను. చిరంజీవిగారి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని అన్నివైపుల నుంచి ఆ స్థాయి అంశాలను అల్లుకుంటూ వచ్చాను.

ఇవన్నీ కాకుండా ఈ సినిమా పరంగా నాకు దొరికిన ప్రసాదం .. రామ్ చరణ్. ఇంతకుముందు ఆయన చిరంజీవి సినిమాల్లో జస్ట్ అలా కనిపించి వెళ్లిపోయారు. చిరంజీవిగారితో కలిసి చరణ్ చేసిన కాస్త నిడివి గల పాత్ర ఇదే. సిద్ధ పాత్రకి చరణ్ ను తీసుకుందామని చిరంజీవిగారితో చెప్పగానే ఆయన ఓకే అన్నారు. చరణ్ గారిని అడగ్గానే వెంటనే ఆయన ఒప్పుకున్నారు. కథపై .. పాత్రపై .. నాపై గల నమ్మకమే అందుకు కారణం. సాధారణంగా గురుకులం నుంచి వచ్చిన వారు అన్నింటిలో నిష్ణాతులై ఉంటారు. ఈ సినిమాలో చరణ్ అలాగే కనిపిస్తారు" అంటూ చెప్పుకొచ్చారు.
Tags:    
  • Acharya 
  • Ramcharan 
  • Koratala Siva 
  • Chiranjeevi 
  • Tollywood 
  • Movie News 
  • Telugu News 

Similar News

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

కమల్ హాసన్ మల్టీ టాస్కింగ్ జర్నీ!

2026-11-10 12:30 GMT

శ్రీదేవి కూతురుపై ఎన్నో ఆశలు.. చివరికి ఎందుకిలా జరిగింది?

2026-11-10 11:30 GMT

రామ్ చ‌ర‌ణ్ హీరోయిన్ క్లారిటీ అప్పుడేనా?

2026-11-10 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS