• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దోచుకున్నా....కథ...

దోచుకున్నా....కథ అందించారు

By - Tupaki Desk
Update: 2015-03-28 06:58 GMT
ఆపదలోనూ అవకాశాన్ని వెతుక్కోవాలి అనే వ్యాఖ్యల్ని సాధారణంగా మనం వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, క్లాసుల్లోనే వింటుంటాం. దాన్ని ఇపుడు ప్రత్యక్ష అనుభవం ద్వారా చెప్తున్నారు ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్. ఓ విందుకు హాజరైన సందర్భంగా దాదాపు రూ.3 లక్షలు దోపిడికి గురైన విషయాన్ని ఆ విధంగా స్వీకరించారు వెంకట్. 
 
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ బర్త్ డే సెలబ్రేషన్స్ షాద్ నగర్ లోని ఆయన ఫాంహౌస్ లో  జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు సినీప్రముఖులు హాజరయ్యారు. పార్టీ అనంతరం రాత్రి 2 గంటల సమయంలో కోన వెంకట్, దానయ్య ..సిటీకి తిరిగి వస్తుండగా కొందరు దుండగులు దారి కాచి దోపిడీకి పాల్పడ్డారు. గొడ్డళ్లతో కారు అద్దాలు పగులగొట్టి వారి వద్ద నుంచి బంగారు గొలుసులు, ఉంగరాలు, డబ్బులు దోచుకు వెళ్లారు. దోచుకు వెళ్లిన సొత్తు మొత్తం రూ.3లక్షల ఉంటుందని అంచనా. వీరి వెనుకనే తమ కార్లలో వస్తున్న శ్రీను వైట్ల, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, గోపీ మోహన్.... దోపిడీ వ్యవహారాన్ని గమనించి తమ వాహనాలను వెనక్కి తిప్పి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కోన వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

  ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దోపిడిపై కోన వెంకట్ స్పందిస్తూ... తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని అన్నారు. మెడపై కత్తిపెట్టి డబ్బులు ఇవ్వాలని దొంగలు బెదిరించారని, దొంగల దాడి నుంచి ప్రాణాలతో బయటపడినందుకు హ్యాపీగా ఉందన్నారు. అయితే... డబ్బు పోతే పోయింది కానీ, తన తదుపరి చిత్రానికి మంచి కథ దొరికిందని కోన వెంకట్ వ్యాఖ్యానించటం ఇందులో అసలు ట్విస్ట్. ఈ దారిదోపిడీకి సంబంధించిన సన్నివేశాలు, దాని కథాకమామిషు అంతా ఆయన తదుపరి చిత్రంలో ప్రేక్షకుల్ని అలరిస్తాయా? వేచి చూడాలి మరి.
Tags:    
  • Kona Venkat 
  • Looted 
  • telugu NEWs 

Similar News

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

కమల్ హాసన్ మల్టీ టాస్కింగ్ జర్నీ!

2026-11-10 12:30 GMT

శ్రీదేవి కూతురుపై ఎన్నో ఆశలు.. చివరికి ఎందుకిలా జరిగింది?

2026-11-10 11:30 GMT

రామ్ చ‌ర‌ణ్ హీరోయిన్ క్లారిటీ అప్పుడేనా?

2026-11-10 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS