2021 NYE.. జంట‌ల‌న్నీ ఒంట‌రి దీవుల‌కు జంప్

Update: 2020-12-31 06:31 GMT
కోవిడ్ 19 మహమ్మారి భ‌యాల న‌డుమ‌ బాలీవుడ్ జంటలు తమ నూతన సంవత్సరం వేడుక‌ల కోసం ఒంట‌రి దీవులకు ప‌య‌న‌మ‌వ్వ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. షూటింగుల‌కు సెల‌వులు తీసుకుని ఇప్ప‌టికే ప‌లు జంట‌లు మాల్దీవులు స‌హా గోవా బీచ్ ల‌ను పునీతం చేసేందుకు బ‌య‌ల్దేరి వెళుతున్నాయి.

రణబీర్ కపూర్-అలియా భట్ జంట‌..  రణ్ ‌వీర్ సింగ్-దీపికా పదుకొనే జోడీ నూతన సంవత్సర వేడుకలు జైపూర్ కు వెళ్లారు. వీరంతా అట్నుంచి ఏదైనా ఒంటరి దీవి షికార్ కి వెళ్లేందుకు ఆస్కారం లేక‌పోలేద‌న్న ఊహాగానాలు సాగుతున్నాయి. నేటిత‌రం ల‌వ్ క‌పుల్ గా గుస‌గుస‌లు వినిపిస్తున్న సిదార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ జంట‌.. అలానే ఇషాన్ ఖత్తార్- అనన్య పాండే జంట‌లు ముంబై విమానాశ్రయంలో కెమెరా కంటికి చిక్కాయి.

తాజా నివేదికల ప్రకారం.. ఈ జంట‌లు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి మాల్దీవులకు బయలుదేరారు. తాజా ఫోటో ప్రూఫ్ ల‌తో వీళ్ల మ‌ధ్య ఎఫైర్ బహిరంగంగా అంగీకరించిన‌ట్టేన‌ని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

కియారా అద్వానీ- సిధార్థ్ మల్హోత్రా .. అనన్య పాండే- ఇషాన్ ఖత్తర్ జంట‌గా వెళ్లినా వారు కేవ‌లం స్నేహితులేనా లేక ప్రేమికులా? అన్న‌దానికి వారి నుంచే స‌మాధానం రావాల్సి ఉంది. ప్ర‌స్తుతానికి వారి మాల్దీవుల సెలబ్రేష‌న్ నుండి అద్భుతమైన ఫోటోలు వీడియోలు అంత‌ర్జాలాన్ని షేక్ చేయ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఇక వీళ్ల‌తో పాటు గోవా బీచ్ లో స‌మంత‌- నాగ‌చైత‌న్య జంట షికార్లు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.
Tags:    

Similar News