• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కేజీఎఫ్‌ కు అయినా ఆ డేట్‌...

కేజీఎఫ్‌ కు అయినా ఆ డేట్‌ సెట్‌ అయ్యేనా?

By - Tupaki Desk
Update: 2020-02-07 07:30 GMT
జులై 30 2020 తేదీ మొన్నటి వరకు మీడియాలో మారుమ్రోగి పోయింది. తెలుగు మీడియాలోనే కాకుండా ఇతర రాష్ట్రాల మీడియాల్లో మరియు జాతీయ మీడియాలో కూడా ఆ తేదీ గురించి తెగ వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఆ తేదీన జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించడమే. చాలా నెలలుగా ఆ తేదీకే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం వస్తుందనుకున్నారు. కాని సినిమా షూటింగ్‌ ఆలస్యం అయిన కారణంగా క్వాలిటీ విషయం లో రాజీ పడవద్దనే ఉద్దేశ్యం తో ఏకంగా వచ్చే ఏడాది జనవరి 8కి ఆర్‌ఆర్‌ఆర్‌ ను వాయిదా వేయడం జరిగింది.

జక్కన్న అండ్‌ టీం వదిలేసిన జులై 30వ తారీకును ఇప్పుడు యశ్‌ టీం ‘కేజీఎఫ్‌ 2’ చిత్రంతో భర్తీ చేయాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కేజీఎఫ్‌ 2 చిత్రాన్ని మే లేదా జూన్‌ లో విడుదల చేయాలని భావించారు. కాని బాలీవుడ్‌ స్టార్స్‌ ఈ చిత్రంలో నటిస్తున్న కారణంగా వారి డేట్లు కుదరక పోవడంతో షూటింగ్‌ అనుకున్న దానికంటే ఆలస్యంగా నడుస్తుందట. దాంతో సినిమాను అనుకున్న సమయంకు విడుదల చేయలేక  పోవచ్చు అంటూ ఇప్పటికే కన్నడ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

ఎలాగూ మే లేదా జూన్‌ లో సినిమాను తీసుకు రాలేరు. కనుక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వదిలేసిన జులై 30కి అయినా కేజీఎఫ్‌ 2 ను తీసుకు వస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే షూటింగ్‌ అప్పటి వరకు అయినా పూర్తి అయ్యి విడుదలకు సిద్దం చేస్తారా లేదా అనేది అనుమానంగానే ఉంది. ఇప్పటి వరకు సినిమా ఎంత పూర్తి అయ్యిందనే విషయం పై ఎలాంటి క్లారిటీని యూనిట్‌ సభ్యులు ఇవ్వడం లేదు. దాంతో జులై 30వ తేదీ కి కూడా వచ్చే అవకాశాలు తక్కువే అంటూ కన్నడ పరిశ్రమ లో టాక్‌ వినిపిస్తుంది.
Tags:    
  • Kgf 
  • KGF Pre Release Business 
  • Kgf Chapter 2 
  • Namma Yash 
  • Yash 
  • Kollywood 
  • Kollywood News 
  • Sandalwood 
  • Sandalwood Latest Movie Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

మ‌ళ్లీ హ్యాట్రిక్ కొట్టిన సూర్య‌!

2026-11-09 06:41 GMT

రివ‌ర్స్ గేమ్ మొద‌లు పెట్టిన స‌తీమ‌ణి!

2026-11-09 06:21 GMT

రామాయణం బడ్జెట్‌లో 9 శాతంతో తెరకెక్కిన గాడ్జిల్లా మైనస్ జీరో దూకుడు!

2026-11-09 06:05 GMT

జపనీయుల మధ్య దేవరకొండ ఫ్యామిలీ స్పెషల్ దివాళీ.. వీడియో వైరల్!

2026-11-09 05:26 GMT

రామాయణంపై ఈ తరం వింత ప్రశ్న..!

2026-11-09 04:58 GMT

ర్యాపిడ్ ఫైర్ లో చైతూను ఇరికించేసిన సుమా.. ఏం క్లారిటీ గురూ!

2026-11-09 04:25 GMT

హీరోయిన్ అవ్వాలంటే.. అందమే ముఖ్యమా.. జాన్వీ..?

2026-11-09 04:25 GMT

వ‌రుస‌గా క్రేజీ సినిమాల‌తో రేసులో అగ్ర నిర్మాణ సంస్థ

2026-11-09 04:24 GMT

ప్రభాస్ ఈ సినిమాలకు సీక్వెల్స్ చేస్తే బాగుంటుందా?

2026-11-09 04:16 GMT

ఎడిట‌ర్ ఆవేద‌న‌: ఫంక్ష‌న్ల‌కు వెళ్లినా ప‌ట్టించుకోని శాఖ ఇది!

2026-11-09 03:40 GMT

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

Copyright @2026

Powered by Blink CMS