సూపర్ స్టార్స్ తోనే అంటున్న కీర్తి
హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే కీర్తి సురేష్ సౌత్ లోని దాదాపు స్టార్ హీరోల అందరిని ఒక చుట్ట చుట్టేసింది. అంటే స్టార్ హీరోలందరితో నటించే ఛాన్స్ దక్కించుకుంది. తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరియు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో ప్రస్తుతం నటిస్తున్న కీర్తి సురేష్ త్వరలో మరో సూపర్ స్టార్ కమల్ హాసన్ తో కూడా నటించేందుకు ఓకే చెప్పినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
కమల్ హాసన్ హీరో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ‘వెట్టయ్యాడు విలైయ్యాడు’ చిత్రంకు సీక్వెల్ రాబోతుంది. తెలుగులో రాఘవన్ గా విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. 2006లో వచ్చిన ఆ చిత్రంకు ఇప్పుడు సీక్వెల్ పనిలో గౌతమ్ మీనన్ ఉన్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను నటింపజేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న మహేష్ బాబు రజినీకాంత్ ల సినిమాలు పూర్తి అయిన తర్వాతే కమల్ హాసన్ తో నటిస్తానంటూ కీర్తి సురేష్ అన్నట్లుగా తెలుస్తోంది.
మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్ కు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఒక వైపు వాటిని చేస్తూనే మరో వైపు సూపర్ స్టార్స్ చిత్రాలను కమిట్ అవుతుంది. నటిగా ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తూనే మరో వైపు హీరోలతో కమర్షియల్ చిత్రాలు చేస్తున్న కీర్తి సురేష్ ప్రస్తుతం సౌత్ లోనే అత్యంత బిజీ హీరోయిన్ గా నిలిచింది.