ఫోటో స్టోరీ: టవల్ జారుతుంటే..

Update: 2017-04-27 16:12 GMT
మనిషికో రకమైన టేస్ట్ ఉంటుంది. దాన్నే కొంతమంది మనిషికో పిచ్చి అని కూడా అంటూ ఉంటారులే. అయితే.. ఎన్నో మాటలు చెప్పలేని విషయాలను ఒక ఫోటోతో చెప్పచ్చు. ఆ విషయాన్ని చిత్రాలు నిరూపిస్తాయి.

ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ మారియో టెస్టినోకు ఈ విషయంలో విభిన్నమైన టేస్ట్ ఉంది. 62 సంవత్సరాల వయసున్న ఈయన తన ఫోటోగ్రఫీతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఈయన తీసే చిత్రాలలో టవల్ సిరీస్ కు స్పెషల్ గుర్తింపు ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అందాల భామల సౌందర్యాన్ని తన ఫోటోల రూపంలో బంధించాడీయన. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ను కూడా ఈ టవల్ సిరీస్ లో భాగం చేశాడు. మారియో టెస్టినో కోసం టవల్ తో అమ్మడు ఇచ్చిన పోజ్ సూపర్బ్ గా ఉంది.

బ్లాక్ అండ్ వైట్ ఫోటో అయినా.. కత్రినా ప్రదర్శిస్తున్న సౌందర్యం అదరహో అనాల్సిందే. కేట్ బ్యాక్ అందాలు భలేగా మెరిసిపోతున్నాయి. టవల్ ను ఎంత గట్టిగా పట్టుకున్నా.. ఒంటిమీద అది ఒక్కటే ఉంటే జారిపోతానని అంటుంది మరి. అలా జారుతుంటే తీసిన ఈ ఫోటోలోని కత్రినా అందాలు.. అభిమానులకు కొత్త ఆనందాన్ని అందిస్తున్నాయి.
Tags:    

Similar News