కొత్తగా 'కత్తి'లాంటి సెటైరేస్తాడట

Update: 2017-12-13 14:30 GMT
సినిమా క్రిటిక్ గా అప్పుడప్పుడే ఎదుగుతున్న సమయంలో కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసి పాపులారిటీని సంపాదించుకున్న వ్యక్తి ఎవరో అందరికి తెలిసిందే. ప్రతి రోజు పవన్ భజన చేసే కత్తి మహేష్ రోజు రోజుకు తన ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నం చాలానే చేస్తున్నాడు. ఇక కొన్ని టీవీ ఛానెల్స్ కూడా ఈ వివాదానికి మసాలా తగిలించి మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే మనోడు పెసరట్టు  అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.

చాలా మందికి ఆ సినిమా పేరు కత్తి మహేష్ పాపులర్ అయ్యాక తెలిసింది. అసలు ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు అతను మళ్లీ మరొక సినిమాను చేయడానికి రెడీ అయ్యాడు. పొలిటికల్ సెటైర్ పై ఆ కథ ఉంటుందని చెబుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని ఇండియాలోని ప్రస్తుత రాజకీయాలని బేస్ చేసుకొని ఆ సినిమా ఉంటుందని కత్తి మహేష్ తెలిపాడు.

అయితే సోషల్ మీడియాలో మాత్రం అయన ఎనౌన్స్ మెంట్ కి కామెంట్స్ ఓ రేంజ్ లో వెలువడుతున్నాయి. వాటి గురించి చెప్పడం కన్నా డైరెక్ట్ గా చదివితే మీకే అర్ధమవుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులనే కాకుండా చాలా మంది డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ పై సినిమా చేస్తున్నావని చెప్పొచ్చుగా అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య కత్తి మహేష్ వ్యాఖ్యలు కొంచెం శృతి మించడంతో సాధారణ జనాలు కూడా కత్తి మహేష్ కామెంట్స్ కి రివర్స్ లో కౌంటర్లు వేస్తున్నారు.   



Tags:    

Similar News