క‌రిష్మా త‌న్నా అందాలు తానా తందానా

Update: 2020-07-22 05:15 GMT
బుల్లితెర‌పై వెలుగులు విర‌జిమ్మి వెండితెర‌పై స్టార్ అవ్వాల‌ని క‌ల‌గ‌నే యాంక‌ర‌మ్మ‌ల‌కు కొద‌వేమీ లేదు. ఊర్వ‌శి రౌతేలా.. అవికా గోర్.. అనిత హస‌నందానీ.. మౌనీ రాయ్ .. ఇలా ఎంద‌రో భామ‌లు వెండితెర డ్రీమ్స్ ని నెర‌వేర్చుకుంటున్నారు. ఇదే బాట‌లో బుల్లితెర నుంచి వెండితెర‌కు ప్ర‌మోటైన్ భామ క‌రిష్మా త‌న్నా.

న‌చ్ భ‌లియే.. ఝ‌ల‌క్ దిక‌లాజా లాంటి టీవీ కార్య‌క్ర‌మాల‌తో పాపుల‌రైంది ఈ బ్యూటీ. న‌టి .. మోడ‌ల్ కం యాంక‌ర్ గా క‌రిష్మా త‌న్నా కెరీర్ సాగింది. ప్ర‌స్తుతం పెద్ద తెర‌పైనా రాణిస్తోంది. అందంతో పాటు వేడెక్కించే కంటెంట్ తో క‌రిష్మా త‌న్నా సోష‌ల్ మీడియాల్లోనూ అగ్గి రాజేస్తోంది.

స్వ‌త‌హా గుజ‌రాతీ అయిన ఈ అమ్మ‌డు బాలీవుడ్ న‌టుడు ఉపేన్ ప‌టేల్ తో డేటింగ్ చేయ‌డంతో మ‌రింత పాపులారిటీ తెచ్చుకుంది. అటుపై హిందీ బిగ్ బాస్ ఇంటి స‌భ్యురాలిగా సంద‌డి చేసి ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంది. ప్ర‌స్తుతం చేతిలో సినిమాలేవీ లేవు కానీ టీవీ షోల‌కు కొద‌వేమీ లేదు. క‌త్రోంకి కిలాడీ సీజ‌న్ 10 లోనూ ఈ అమ్మ‌డు అల‌రించ‌నుంది.

గ్యాప్ దొరికితే చాలు ఇదిగో ఇలా సోష‌ల్ మీడియాల్లో వేడెక్కిస్తుంది. బికినీ లుక్ .. బాత్ ట‌బ్ లుక్ ఓల్డ్ ఫ్యాష‌న్ అని భావించిందో ఏమో ఈసారి లేటెస్టుగా ఇలా ఇన్న‌ర్ అందాల్ని ఎర‌వేసి మంట‌లు పెట్టేస్తోంది. యువ‌త‌రం ప‌దే ప‌దే ఇన్ స్టా ఫోటోల‌కే అతుక్కుపోయేలా చేస్తోంది. వైట్ టాప్ లో త‌న్నా అందాలు మ‌త్తెక్కించేస్తున్నాయ్.
Tags:    

Similar News