50 కోట్లు సేక‌రించి ఇన్సూరెన్స్.. కొట్టి పారేసిన నిర్మాత‌!

Update: 2021-09-06 10:12 GMT
కొవిడ్ కార‌ణంగా ఫిలింమేక‌ర్స్ అలెర్ట్ అవుతున్నారు. సినిమాకు ముందుగానే ఇన్సురెన్స్ చేయిస్తున్నారు. క‌నీసం నిర్మాణానికి అయిన ఖ‌ర్చులైనా వ‌స్తాయ‌ని నిర్మాత‌లు సినిమా ప్రారంభానికి ముందుగానే సేఫ్టీ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుత ప‌రిస్థితుల్లో ఇన్సురెన్స్ క్లెయిమ్ పాల‌సీలు నిర్మాత‌ను కొద్దోగొప్పో కాపాడుతున్నాయ‌ని నివేదిక‌లు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహార్  త‌న సినిమాకు  ఏకంగా 50 కోట్లు ఇన్సురెన్స్ క్లెయిమ్ చేసిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌స్తుతం ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్- ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా బ్ర‌హ్మాస్త్ర‌ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నాయి. సినిమా నిర్మాణ వ్యయం 400 కోట్లుపైగానే అవుతోందిట‌.

ఈ నేప‌థ్యంలో క‌ర‌ణ్ జోహార్ 50 కోట్లు సినిమాకు ప‌నిచేస్తున్న వారి నుంచి సేక‌రించి క్లెయిమ్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు తెరమీద‌కు వ‌చ్చాయి. మొత్తం  ఐదు ఇన్సూరెన్స్  కంపెనీల‌తో క‌ర‌ణ్ ఒప్పందం చేసుకున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. క్లెయిమ్ రూపంలో స‌ద‌రు సంస్థ‌ల‌కు 400 కోట్లు రిట‌ర్న్ వ‌చ్చేలా ఒప్పందం చేసుకున్న‌ట్లు బాలీవుడ్ మీడియా క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి.  అయితే ఈ వార్త‌ల్ని క‌ర‌ణ్ కొట్టి పారేసారు. తాను ఎలాంటి  డ‌బ్బు సేక‌ర‌ణ చేప‌ట్ట‌లేద‌ని ఇన్సురెన్స్ చేయ‌లేద‌ని వెల్ల‌డించారు. ఇన్సురెన్స్ చేయాల‌నుకుంటే త‌న సొంత డ‌బ్బుతోనే చేస్తాను.. త‌ప్ప విరాళాల రూపంలో సేక‌రించాల్సిన అవ‌స‌రం త‌న‌కెందుకుని అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసారు. ఇలాంటి త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారం చేయోద్ద‌ని హిత‌వు ప‌లికారు.

బ్ర‌హ్మ‌స్త్ర‌లో అమితాబ‌చ్చ‌న్..ర‌ణ‌బీర్ క‌పూర్..నాగార్జున‌..అలియా భ‌ట్..మౌనీరాయ్..డింపుల్ క‌పాడియా లు కీల‌క పాత్ర‌లు  పోషిస్తున్నారు. అమితాబ్ బ్ర‌హ్మ పాత్ర‌లో...నాగార్జున విష్ణు పాత్ర‌లో..ర‌ణ‌బీర్ క‌పూర్ శివ పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది.  ఆయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రీత‌మ్ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూర్చుతున్నారు.
Tags:    

Similar News