ట్రోల్స్ కారణంగా మరో ఇన్ స్టా అకౌంట్ ఓపెన్ చేసిన స్టార్ ఫిల్మ్ మేకర్
బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్.. ఇంకా స్టార్స్ మేకర్ అని కూడా కరణ్ జోహార్ కు పేరుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్స్ గా వెలుగు వెలుగుతున్న ఎంతో మంది వారసులను కరణ్ జోహార్ పరిచయం చేశాడు. పలువురు హీరోయిన్స్ మరియు హీరోలను కరణ్ జోహార్ స్టార్స్ గా మార్చాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సీనియర్ స్టార్ హీరోల పిల్లలను సినిమాల్లోకి పరిచయం చేయడంలో కరణ్ జోహార్ కు మంచి పేరుంది. ఇప్పుడు ఆ పేరుతోనే కరణ్ జోహార్ ఇబ్బంది పడుతున్నాడు.
కరణ్ వంటి వారి వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని.. నెపొటిజం ప్రస్థావన వచ్చిన ప్రతి సారి కూడా కరణ్ జోహార్ ను జనాలు విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు. కరణ్ జోహార్ వల్లే ఎంతో మంది బ్యాక్ గ్రౌండ్ లేని వారు ఆఫర్లు కోల్పోతున్నారు అంటూ నెట్టింట గడచిన నెల రోజులుగా పోస్ట్ లు పడుతూనే ఉన్నాయి. కరణ్ జోహార్ ట్రోల్స్ తట్టుకోలేక ఏకంగా సోషల్ మీడియా అకౌంట్స్ ను డీ యాక్టివేట్ చేశాడు.
సోషల్ మీడియాను ఫాలో అయ్యే ఉద్దేశ్యంతో తన పేరుతో మరో అకౌంట్ ను క్రియేట్ చేయడం చర్చనీయాంశంగా ఉంది. కరణ్ అఫైర్స్ అంటూ కొత్త అకౌంట్ ను ఓపెన్ చేసిన ఆయన 115 మందిని ఫాలో అవుతున్నాడు. ఆయన్ను బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఆయన సన్నిహితులు కలిపి 21 మంది ఫాలో అవుతున్నారు. ఇప్పటి వరకు ఆ అకౌంట్ లో కేవలం ఒక్క పోస్ట్ మాత్రమే పెట్టాడు. ఎందుకు కరణ్ మరో అకౌంట్‌ను క్రియేట్ చేశాడు అనే విషయంలో పలు రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.