అపర కాళికలా యువహీరోని చెండాడింది!
నటవారసుల్ని టార్గెట్ చేస్తూ కంగన రనౌత్ నిరంతరం అగ్గి రాజేస్తూనే ఉంది. అందుకే క్వీన్ కి బాలీవుడ్ లో శత్రువులు ఎక్కువయ్యారు. ఈ జాబితాలో ఇటీవలే పెళ్లాడిన స్టార్ కిడ్ రణబీర్ కపూర్ కూడా ఉన్నాడు.
కంగనా రనౌత్ రణబీర్ కపూర్ ను ఇంతకుముందు తీవ్రంగా దూషించింది. ``నువ్వు అలా ఎలా మాట్లాడగలవు? బాధ్యత లేదా?`` అంటూ ప్రశ్నించింది. రాజకీయాలపై వ్యాఖ్యానించడం మానుకున్నందుకు రణబీర్ కి క్లాస్ తీస్కుంది. రణబీర్ కపూర్ పాత ఇంటర్వ్యూని ప్రస్తావిస్తూ.. రాజకీయ ప్రకటన చేయకుండా ఎందుకు దూరంగా ఉన్నావు? అంటూ రణబీర్ ని కంగన అడిగారు.
రణబీర్ కపూర్ ప్రవర్తనను కంగనా రనౌత్ తప్పుపడుతూ `బాధ్యతా రహితం` అని తిట్టేసింది. కంగనా రనౌత్ మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ- తను వెడ్స్ మను సిరీస్ సహా మరెన్నో చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది. ఆమె తన అభిప్రాయాలను ముక్కుసూటిగా నిజాయితీగా చెబుతుంది. అదే తీరుగా ఇప్పుడు రణబీర్ కపూర్ ను ఆమె నిందించింది.
2019లో కంగనా తన అప్పటి విడుదలైన మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రం విజయాన్ని తన సహనటి అంకితా లోఖండేతో కలిసి జరుపుకుంది. మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా.. ఆమెకు రాజకీయాల్లోకి రావాలని లేదా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఏదైనా ఆకాంక్ష ఉందా అని అడిగారు.
అప్పుడు కంగనా రనౌత్ ఏమన్నారంటే.. ``నాకు రాజకీయాల్లో లేదా రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచారంలో చేరాలనే ఉద్దేశ్యం లేదు. నేను రాజకీయాల్లోకి రావాలని చాలా మంది అనుకుంటున్నారు.. కానీ అది నిజం కాదు. మన పరిశ్రమలో రణబీర్ కపూర్ లాంటి నటులు చాలా తక్కువ మంది ఉన్నారు. అతడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ -``మా ఇంటికి నీళ్లు విద్యుత్ సదుపాయం ఉంది కాబట్టి నేను రాజకీయాల గురించి ఎందుకు వ్యాఖ్యానించాలి?`` అని అన్నారు. దానిపై కంగన వెంటనే పంచ్ వేసింది. ``మీరు మీ విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నారు. మెర్సిడెస్ లో ప్రయాణిస్తున్నారు! కాబట్టి మీరు అలా ఎలా మాట్లాడగలరు? ఇది బాధ్యతారహితమైన ప్రవర్తన... నేను అలాంటి వ్యక్తిని కాదు...`` అని కంగన వ్యాఖ్యానించింది.
రణబీర్ పాత ఇంటర్వ్యూని ప్రస్తావిస్తూ.. రాజకీయ ప్రకటన చేయకుండా ఎందుకు దూరంగా ఉన్నారని అడిగారు. దానికి రణబీర్ సమాధానమిచ్చారు. తాను రాజకీయాలను అనుసరించనని చెప్పాడు. తన జీవితానికి రాజకీయాలకు ఎటువంటి తేడా లేదు. అలాగే కనీస అవసరాలు అన్నీ ఉండడంతో సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నట్లు తెలిపారు.
కంగనా రనౌత్ ఇంకా మాట్లాడుతూ, “రాజకీయాల గురించి మాట్లాడటం మీ కెరీర్ కు ఆటంకం కలిగిస్తే దానిని వదిలేయండి. నా ఇంటికి నీరు విద్యుత్తును కూడా క్రమం తప్పకుండా సరఫరా చేస్తున్నాను కానీ నేను ఇతర సమస్యల గురించి మాట్లాడను అని అనడం సరి కాదు. ఇది మారాలి ..మీడియా దానిని మార్చాలి..`` అని రణబీర్ వ్యాఖ్యలకు కౌంటర్ వేసారు.
మీరు దేశ సమస్యలను తెలుసుకుని కూడా దూరం కాకూడదని నేను భావిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో మీరు ప్రభుత్వం పనితీరు గురించి మాట్లాడాలి. ఈ దేశంలోని యువకుడిగా మీ రాజకీయ ప్రవృత్తి గురించి కూడా మాట్లాడాలి. నాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి.. నేను రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడతాను? అంటూ మీరు చెప్పకూడదు. సొంత దేశంతో తమకు సంబంధం లేదని వాదించేవారు.. తమ కెరీర్ గురించి ఎందుకు అంతగా పాకులాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు'' అని కంగనా అన్నారు.