#metoo మాల్వి మల్హోత్రాకు మద్దతుగా నిలిచిన కంగనా

Update: 2020-10-28 05:00 GMT
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌న ర‌నౌత్ మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచింది. టెలివిజ‌న్ న‌టి మాల్వి మల్హోత్రా అభ్య‌ర్ధ‌న‌పై స్పందించింది. వివాహ ప్రతిపాదనను తిరస్కరించినందుకు ఆమెపై దాడికి దిగిన యోగేష్ మ‌హిపాల్‌సింగ్ పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని,.. ఈ విష‌యంలో త‌న‌కు అండ‌గా నిల‌వాల‌ని కంగ‌న‌న‌ను అభ్య‌ర్థించింది.

దీంతో రంగంలోకి దిగిన కంగ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా మాల్వి మ‌ల్హోత్రాకు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. వెంట‌నే నిందితుడిని క‌ష్ట‌డీలోకి తీసుకుని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎన్సీబీ చైర్మ‌న్ రేఖ శ‌ర్మ‌ని కోరింది. త‌న‌ని న‌తాను నిర్మాత‌గా ప‌రిచ‌యం చేసుకున్న యోగేష్ మ‌హీపాల్ సింగ్‌ ని చ‌ట్ట‌ప‌రంగా శిక్షించాల‌ని డిమాండ్ చేసింది.

`ఇది చలన చిత్ర పరిశ్రమ యొక్క నిజస్వ‌రూపం. స‌రైన సంబంధాలు.. ఎలా వెళ్లాలో తెలియ‌క స‌ఫ‌ర్ అవుతున్న వాళ్ల‌కు ఇది త‌ర‌చూ జరుగుతోంది. వార‌స‌త్యం  , బంధుప్రీతి ప‌క్షపాతం వున్న‌ పిల్లలు తమకు కావలసినంతగా తమను తాము రక్షించుకోవచ్చు. కాని వారిలో ఎంతమందిని పొడిచి, అత్యాచారం చేసి చంపారు?.. అని కంగ‌న ప్ర‌శ్నిస్తోంది.

ప్రియమైన మాల్వి నేను మీతో ఉన్నాను. మీరు క్రిటిక‌ల్‌ గా ఉన్నారని నేను చదివాను. ప్రియమైన అమ్మాయి మీ కోసం ప్రార్థిస్తున్నాను. షర్మరేఖగారు అపరాధిపై తక్షణ చర్యలు తీసుకోవడానికి మేము మీతో ఉన్నాము. మేము మీకు న్యాయం చేస్తాము. దయచేసి విశ్వాసం కలిగి ఉండండి` అని ట్వీట్ చేసింది కంగ‌న‌.
Tags:    

Similar News