థాక్రేపై ఆ రేంజులో ఫైరైన క్వీన్ కంగ‌న‌.. ముంబై నా అడ్డా ఏం చేస్తావ్?

Update: 2020-10-26 15:00 GMT
కంగ‌న ర‌నౌత్ వ‌ర్సెస్ శివ‌సేన ఎపిసోడ్స్ తెలిసిన‌దే. ఈ ఎపిసోడ్స్ నెవ్వ‌ర్ ఎండింగ్ అన్న తీరుగా కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా శివ‌సేన అధినాయకుడు ఉద్ధ‌వ్ ఠాక్రేని ఉద్ధేశించి కంగ‌న చేసిన వ్యాఖ్య లు అనంత‌రం కంగ‌న స్వ‌రాష్ట్రం హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ని ఉద్ధేశించి థాక్రే చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

ఇంత‌కుముందు ముంబై పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ లా ఉంది అంటూ కంగ‌న ఘాటైన వ్యాఖ్య‌లు చేయ‌గా.. దానికి ప్ర‌తిస్పంద‌న‌గా.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కంగ‌న ప్లేస్ ని గంజాయి వ‌నంతో పోల్చ‌డం వేడెక్కించింది.  కంగ‌న బాలీవుడ్ డ్రగ్స్ గురించి మాట్లాడినందుకు.. సుశాంత్ కేసులో  ముంబై పోలీసుల విచార‌ణ‌కు అపకీర్తి కలిగించినందుకు ఉద్ధ‌వ్ పరోక్షంగా కంగ‌న‌పై ఫైర‌య్యారు.

ఇక కంగ‌న స్పందిస్తూ..తన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్  దేవతల భూమిగా ఎలా పిలువబడుతుందో, తెలిసీ.. గంజాయి పెరిగే భూమి అని థాక్రే అన‌డం అవమానకరమని పేర్కొంది. ఆదివారం నాడు థాక్రే దసరా ర్యాలీలో మాట్లాడుతూ...``ముంబై పై ఆరోపించేవారు... న్యాయం కోసం కేకలు వేసేవారు....గంజా క్షేత్రాలు మీ రాష్ట్రంలోనే ఉన్నాయని .. మా మహారాష్ట్రంలో కాదని గ్రహించాలి`` అని కంగ‌న‌ను లక్ష్యంగా పెట్టుకుని మ‌రీ విమ‌ర్శించారు. కంగన పేరు డైరెక్టుగా ప్ర‌స్థావించ‌కుండా..త‌న‌ని టార్గెట్ చేశారు.

“ముంబై ఈజ్ పీవోకే... ప్రతిచోటా మాదకద్రవ్యాల బానిసలు ఉన్నారు. కానీ ముంబైపై నే అలాంటి చిత్రాన్ని పెయింటింగ్ చేస్తున్నారు. మా ఇంట్లో వారికి తెలిసింది తులసి.., గంజా కాదు. గంజా క్షేత్రాలు మీ రాష్ట్రంలో ఉన్నాయి. మా మహారాష్ట్రలో కాదు.. ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు. ”అంటూ థాక్రే వ్యాఖ్యానించారు.

కంగనా తన ట్వీట్ ‌లో దానికి కౌంట‌ర్ వేసింది.. “ముఖ్యమంత్రి గారూ మీరు చాలా చిన్న వ్యక్తి. హిమాచల్‌ను దేవ్ భూమి అని పిలుస్తారు. మాకు గరిష్ట సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. నేరాల రేటు సున్నా.. ఇది చాలా సారవంతమైన భూమిని కలిగి ఉంది. ఇది ఆపిల్- కివీస్- దానిమ్మ - స్ట్రాబెర్రీలు ఇక్కడ దేనినైనా పెంచుకోవచ్చు… మీరు శివుడు అయినా .. మా పార్వతి నివాసంగా ఉన్న ఒక రాష్ట్రం గురించి ప్రతీకారం తీర్చుకుంటున్నారు. మను రిషి వంటి గొప్ప సాధువులతో పాటు.. పాండవులు గడిపారు హిమాచల్ ప్ర‌దేశ్ లో.. అంటూ కంగ‌న వ్యాఖ్య‌ను జోడించింది.

ఠాక్రే తనను ‘బహిరంగంగా బెదిరిస్తున్నారు’ అని ఆరోపించ‌డ‌మే గాక‌.. ఇప్పుడు ‘జీరో క్రైమ్ రేట్’ ఉన్న ప్రదేశమైన తన రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు అని కంగ‌న వ్యాఖ్యానించింది.  సీఎం బహిరంగ బెదిరింపుపై నేను బ‌య‌ప‌డ‌ను అని కంగ‌న వ్యాఖ్యానించింది. థాక్రే దేశాన్ని విభజిస్తున్న ఒక వర్కింగ్ సిఎం .. ఆయ‌న‌ ధైర్యాన్ని చూడండి. అతను కేవలం ఒక ప్రజా సేవకుడు మాత్ర‌మే. అతని ముందు మరొకరు ఉన్నారు, త్వరలోనే అతను బయటికి వస్తాడు. రాష్ట్రానికి సేవ చేయడానికి మరొకరు వస్తారు. అతను మహారాష్ట్ర నాదే అన్న‌ట్టు గా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? ” అంటూ తీవ్ర వ్యాఖ్య‌ను చేసింది.హిమాచల్ ప్రదేశ్ మాదిరిగానే ముంబై కూడా తన నివాసమని, ఆమె ‘తన ప్రజాస్వామ్య హక్కులను కొల్లగొట్టడానికి’ ఎవరినీ అనుమతించదని కంగ‌న పేర్కొంది.
Tags:    

Similar News