బీ గ్రేడ్ న‌టి అంటూ తాప్సీపై మ‌రోసారి కంగ‌న ఫైర్!

Update: 2021-02-04 09:30 GMT
కంగ‌న వ‌ర్సెస్ తాప్సీ వైరం గురించి తెలిసిన‌దే. ఆ ఇద్ద‌రూ ఒక‌రంటే ఒక‌రు అగ్గి మీద గుగ్గిలంలా మ‌రిగిపోతుంటారు. ఫిరంగులు విసురుకుని క‌త్తులు దూస్తారు. ఇంత‌కుముందు క్వీన్ కంగ‌న నేరుగా తాప్సీపై ఎటాక్ చేస్తూ డి-గ్రేడ్ న‌టి అంటూ తిట్టి పారేయ‌డం అటుపై తాప్సీ రివ‌ర్స్ లో ఎటాక్ చేయ‌డం తెలిసిన వ్య‌వ‌హార‌మే.

ఆ త‌ర్వాత ప‌లు మార్లు సోష‌ల్ మీడియాల్లో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా వార్ న‌డిచింది. అదంతా గ‌తం అనుకుంటే ఇప్పుడు ఫ్రెష్ ఎపిసోడ్ ఒక‌టి మ‌ళ్లీ హీటెక్కిస్తోంది. దిల్లీలో పంజాబ్ రైతుల నిర‌స‌న వేళ ఇంట‌ర్నెట్ క‌ట్ చేసిన పీఎం మోదీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అంత‌ర్జాతీయ పాప్ స్టార్ రిహానా కౌంట‌ర్ వేయ‌గా.. దానికి మ‌ద్ధ‌తు ప‌లుకుతూ తాప్సీ స్పందించింది.

దీంతో తాప్సీ వ్య‌వ‌హారంపై కంగ‌న మ‌రోసారి కారాలు మిరియాలు నూరింది. సూటిగా మ‌రోసారి బి-గ్రేడ్ న‌టి అంటూ విమ‌ర్శించింది.  తాప్సీ పన్నూపై కంగ‌న త‌న‌దైన శైలిలో విరుచుకుపడింది. బి గ్రేడ్ యాక్టర్.. ఫ్రీలోడర్.. దేశానికి అన‌వ‌స‌ర భారం!! అంటూ చెడ‌మడా తిట్టేసింది. #ఇండియా ఎగైనెస్ట్ ప్రచారంలో భాగంగా సోషల్ మీడియా హ్యాష్ ‌ట్యాగ్ కి తాప్సీ స‌పోర్ట్ నిచ్చినందుకు మోదీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా స్పందించినందుకు ఈ శిక్ష త‌ప్ప‌లేదు.

ఫ్రీలోడర్‌గా ఉండకండి ... జారీ దేశ్ కా బోజ్ (ఈ దేశంపై భారంలా పడకండి) ... అందుకే నేను వారిని B గ్రేడ్ అని పిలుస్తాను ... ఉచిత లోడర్ ‌లను వ‌దిలి పెట్టేయ్!! అంటూ తాప్సీని విమ‌ర్శించింది కంగ‌న‌.

మరొక ట్వీట్ ‌లో కంగనా ఏమందంటే.. ఆమె సాధించినది ఒక శాస్తీ కాపీ (చౌక కాపీ) .... త‌ను న‌న్ను అనుక‌రిస్తూ నా లాంటి శైలిని కలిగి ఉన్న విష‌యాన్ని ప్రేక్ష‌కులు గ్ర‌హించారు. ఇప్పుడిలా దేశ వ్య‌తిరేకిగా ఉండ‌డం బాలేదు! అని కంగ‌న వ్యాఖ్యానించింది. అయితే దీనికి తాప్సీ కూడా అంతే ధీటుగా స్పందించ‌డం ఆస‌క్తిక‌రం.

తాప్సీ తన ట్వీట్ లో ఏమంది అంటే.. ఒక ట్వీట్ మీ ఐక్యతను దెబ్బతీస్తే.. ఒక జోక్ మీ విశ్వాసంపై సందేశాన్ని రేకెత్తిస్తే.. ఒక ప్రదర్శన మీ మత విశ్వాసాన్ని బ‌య‌ట పెడితే.. అప్పుడు వ్యవస్థను బలోపేతం చేయడానికి మీరు పని చేయాల్సిన అవసరం ఉంది. ఇతరులకు భోధ‌న చేయాల్సిన అవ‌స‌రం లేదు!! అని తాప్సీ తిప్పి కొట్టే ప్ర‌య‌త్నం చేసింది.
Tags:    

Similar News