కమల్ 8 ఏళ్ల క్రితమే చెప్పాడు.. సల్మాన్ ఇప్పుడు ఫాలో అయ్యాడు..!
కోవిడ్ నేపథ్యంలో థియేటర్లు మూతబడటంతో అందరికీ ప్రత్యామ్నాయ మార్గాలుగా ఓటీటీలు కనిపిస్తున్నాయి. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ కి ఆదరణ పెరుగుతుండంతో అందరూ డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ చేయడానికి ముందుకొస్తున్నారు. అయితే భారీ బడ్జెట్ సినిమాలు.. స్టార్ హీరోల సినిమాలు మాత్రం మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే వీరందరికీ ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన 'రాధే' సినిమా డిజిటల్ రిలీజ్ తో పాటుగా థియేట్రికల్ రిలీజ్ అనే కొత్త మార్గాన్ని చూపించింది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ - డైరెక్టర్ ప్రభుదేవా కాంబినేషన్ లో తెరకెక్కిన 'రాధే' - యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్. కరోనా నేపథ్యంలో ఈ చిత్రాన్ని అందుబాటులో ఉన్న థియేటర్స్ తో పాటుగా జీ ప్లెక్స్ - డిష్ టీవీ - డీటుహెచ్ - టాటా స్కై - ఎయిర్ టెల్ డిజిటల్ టీవీల్లో రూ.249 టికెట్ ధరతో రిలీజ్ చేశారు. సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకున్నా ఓటీటీలో మంచి వ్యూస్ రాబట్టింది. నిజానికి థియేట్రికల్ రిలీజ్ తో పాటు పే పర్ వ్యూ విధానంలో డిజిటల్ విడుదల చేయాలని విశ్వనటుడు కమల్ హాసన్ 8 ఏళ్ల క్రితమే ఆలోచన చేశాడు.
కమల్ హాసన్ తన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన 'విశ్వరూపం' చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ తో పాటు డీటీహెచ్ ద్వారా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. తమిళనాడు ప్రభుత్వం నుండి ఎదురైన ఇబ్బందులు.. థియేటర్ల మోనోపలీకి చెక్ పెట్టేందుకు కమల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే థియేటర్ల ఓనర్స్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగడంతో కమల్ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. కోవిడ్ పరిస్థితుల్లో కమల్ ఆలోచనే ఇప్పుడు అదే అందరికీ మార్గమైంది. రాబోయే రోజుల్లో 'రాధే' మాదిరిగానే మరిన్ని సినిమాలు థియేట్రికల్ విడుదలతో పాటు పే ఫర్ వ్యూ విధానంలో డిజిటల్ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.