హలో.. ఇంతలో అంత తేడానా?

Update: 2018-01-02 21:30 GMT
సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి హీరోలు చాలామందే వస్తుంటారు. వాళ్ల సంఖ్యతో పోలిస్తే హీరోయిన్లు రావడం కాస్త తక్కువే. ఈ మధ్య కాస్తంత ట్రెండ్ మారింది. ఇండస్ట్రీ లోని కుటుంబాల నుంచి హీరోయిన్లు కూడా వెండితెరపై తమ సత్తా చాటాలని తెగ ఆరాట పడుతున్నారు. తాజాగా అలా మెరిసిన అందం కళ్యాణి ప్రియదర్శన్. ఫేమస్ మళయాళ - హిందీ సినిమాల దర్శకుడు ప్రియదర్శన్.. అలనాటి అందాల నటి లిజిల సంతానమైన కళ్యాణి రీసెంట్ గా అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో వెండితెరకు పరిచయమైంది.

హలో మూవీలో కళ్యాణి చూసేందుకు అందంగా ఉండటంతో పాటు నటన కూడా ఫర్వాలేదు అనిపించుకుంది. హలో అఖిల్ రీలాంచ్ సినిమా కావడంతో నాగార్జున ఎంతో ఆలోచించాకే కళ్యాణికి ఓటేశాడు. వాళ్ల ఆశలు నిలబెడుతూ కళ్యాణి ప్రేక్షకులను బాగానే మెప్పించింది. కళ్యాణి హీరోయిన్ కాకముందు చాలా లావుగా ఉండేదట. ఒకప్పటి ఆమె ఫొటోలు చూస్తే కనీసం హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా కచ్చితంగా ఎవరూ ఆఫర్ చేయరు. తల్లిదండ్రుల వారసత్వాన్ని నిలబెడుతూ ఎప్పుడైతే హీరోయిన్ కావాలని అనుకుందో అక్కడి నుంచి రూటు మార్చి స్లిమ్ అయ్యేందుకు తెగ శ్రమించింది. గట్టి ప్రయత్నం చేయడంతో తక్కువ సమయంలోనే సన్నబడటంతోపాటు బాడీలో అట్రాక్షన్ కూడా పెరిగేలా ప్రయత్నించింది. దాంతో హలో సినిమాలో ఆమెకు అవకాశం వచ్చింది.

ఆర్ట్ సినిమాల సంగతి పక్కన పెడితే కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ పేరు తెచ్చుకోవాలంటే ఆకాశంలో మెరిసే చందమామ రేంజిలో ఉండాలి. ప్రేక్షకులను మెప్పించాలంటే ఆ మాత్రం అందం ఉండేలా జాగ్రత్త పడాలి. కళ్యాణి మరిన్ని ఛాన్సులు దక్కించుకోవాలంటే మాత్రం గ్లామర్ ఇప్పటికన్నా ఇంకాస్త పెంచాలి... తప్పదు.
Tags:    

Similar News