కాజల్ బికినీ డిజప్పాయింట్ చేసింది

Update: 2016-08-26 14:01 GMT
అదేనండీ.. ఆ బికినీ వార్తల్లో పెద్దగా మ్యాటర్ లేదు అని తెలుస్తోంది. తెలిసేదేముంది.. స్వయంగా కనిపిస్తోంది కూడా. మొన్నటివరకు అసలు స్విమ్మింగ్ పూల్ సాంగులో హీరోయిన్ కాజల్ బికినీ వేసుకుని చించేసిందనే వార్తలు గ్లామర్ లవ్వర్లను ఒక రేంజులో అలరించేశాయి. అయితే అందులో ఎంతవరకు నిజముందో ఈరోజు తెలిసిపోయింది.

''కావలయ్ వేండాల్'' అనే తమిళ సినిమాలో హీరో జీవాతో జతకట్టింది కాజల్. కెరియర్ ఫేడవుట్ అనుకున్న సమయంలో వచ్చి ఆపర్చునిటీ కాబట్టి.. మరో ప్రక్కన సర్దార్ అండ్ బ్రహ్మోత్సవం సినిమాలు ఫ్లాపయ్యాయ్ కాబట్టి.. ఈ సినిమాలో బికినీ వేస్తోందని టాక్ వచ్చింది. దానికి తగ్గట్లే అమ్మడు స్విమ్మింగ్ పూల్ పక్కనే కూర్చుని ఒక తెల్లటి సెమీ ట్రాన్సపరెంటు షర్టులో తన అందాలను ఆరబోస్తున్న ఫోటోలు కొన్ని రిలీజయ్యాయ్. అన్నీ కలిపితే.. బికినీ వేయడం ఖాయం అనుకున్నారు జనాలు.

కాని ఈరోజు రిలీజైన ఈ సినిమా టీజర్ చూస్తే.. ఓ బికినీ బ్రా టాప్ వేసుకున్న కాజల్.. వైట్ నిక్కర్ వేసుకుని.. ఆ బికినీ టాప్ పైన మరో వైట్ కలర్ షర్టు వంటిది వేసుకుంది. అంటే కనిపించీ కనిపించకుండా అందాలను ఆరబోయేడమే కాని.. డైరెక్టుగా అమ్మడు బికినీ వేసుకోలేదు. ఆ టీజర్లో సదరు స్విమ్మింగ్ పూల్ సాంగ్ షాట్ పెట్టేయడంతో ఇప్పుడు బికినీ లవర్స్ ను డిజప్పాయింట్ చేసింది.
Full View

Tags:    

Similar News